మహిళా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట | - | Sakshi
Sakshi News home page

మహిళా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట

Mar 7 2026 9:38 AM | Updated on Mar 7 2026 9:38 AM

యాదగిరిగుట్ట : మహిళలు అన్ని రంగాల్లో రాణించి, సమాజంలో తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని యాదగిరిగుట్ట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గుండ్లపల్లి వాణి భరత్‌గౌడ్‌, బీర్ల ఫౌండేషన్‌ చైర్‌పర్సన్‌ బీర్ల అనిత ఐలయ్య పిలుపునిచ్చారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపో ప్రాంగాణంలో శుక్రవారం మహిళ ప్రజాప్రతినిధులకు ఆర్టీసీ మహిళా ఉద్యోగులకు నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో వారు మాట్లాడారు. రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం.. మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని కొనియాడారు. మహిళలు కేవలం ఇంటికే పరిమితం కాకుండా ప్రతిభను చాటుకుంటూ ఆర్థికంగా ఎదగాలన్నారు. ముఖ్య అతిథులుగా హాజరైన ప్రజాప్రతినిధులను మహిళా ఉద్యోగులు సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ బరిగె రమ్య రాంచందర్‌, కస్తూరి, ఆర్టీసీ మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement