భూదాన్‌పోచంపల్లి : సర్పంచ్‌లు పారదర్శక పాలన అందించి ప్రజల మన్ననలు పొందాలని జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం భూదాన్‌పోచంపల్లి మండలం జలాల్‌పురంలోని స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో చౌటుప్పల్, సంస్థాన్‌నారాయణపురం, బీబీనగర్ మండలాలకు చెందిన నూతన సర్పంచ్‌లకు నిర్వహిస్తున్న శిక్షణ తరగతుల్లో ఆయన మాట్లాడారు. నూతన సర్పంచ్‌లు పంచాయతీరాజ్ చట్టం, విధులు, రికార్డుల నిర్వహణ, నిధుల వినియోగం, ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల పూర్తి అవగాహన పెంపొందించుకోవాలన్నారు. కార్యక్రమంలో భువనగిరి డీఎల్‌పీఓ, ట్రైనింగ్ కోఆర్డినేటర్లు బి.శ్రీకాంత్‌రెడ్డి, రాములు, టీఓటీలు రాపర్తి భాస్కర్, నవీన్‌కుమార్, ఎండీ మాజిద్, దినకర్, వెంకటేశ్వర్లు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


