దొడ్డు బియ్యం.. పురుగులమయం | - | Sakshi
Sakshi News home page

దొడ్డు బియ్యం.. పురుగులమయం

Mar 7 2026 9:38 AM | Updated on Mar 7 2026 9:38 AM

గుండాల : మండలంలోని రేషన్‌ షాపుల్లో దొడ్డు బియ్యం ముక్కి పురుగులు పట్టిపోతున్నాయి. అయినా పట్టించుకునే వారు లేకుండా పోయారు. గుండాల మండల వ్యాప్తంగా 20 రేషన్‌ షాపులకు గతేడాది మార్చిలో ప్రభుత్వం దొడ్డు బియ్యం సరఫరా చేసింది. దీంతో ఒక్కో షాపులో సుమారు 20 నుంచి 25 క్వింటాళ్ల వరకు మొత్తంగా 400 నుంచి 500 క్వింటాళ్ల దొడ్డు బియ్యం ఏడాది కాలంగా నిల్వ ఉంటున్నాయి. గతేడాది ఏప్రిల్‌లో ఉగాది కానుకగా ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టింది. దీంతో దొడ్డు బియ్యాన్ని పట్టించుకోకపోవడంతో పురుగు పట్టిపోతున్నాయి. నిల్వ ఉన్న దొడ్డు బియ్యాన్ని ప్రభుత్వం తిరిగి తీసుకోకపోవడం వల్ల సన్న బియ్యం నిల్వ చేసుకునేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తోందని రేషన్‌ డీలర్లు చెబుతున్నారు. దొడ్డు బియ్యానికి పట్టిన పురుగులు సన్న బియ్యానికి వచ్చే ప్రమాదం ఉందని డీలర్లు ఆందోళన చెందుతున్నారు.

ఫ రేషన్‌ షాపుల్లో

ముక్కిపోతున్న బియ్యం

ఫ వాపస్‌ తీసుకోని ప్రభుత్వం

ఫ సన్న బియ్యం నిల్వకు

డీలర్ల ఇక్కట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement