డాక్టర్ల నిర్లక్ష్యంతోనే రాజేష్ మృతి చెందాడు
సూర్యాపేట : డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే కర్ల రాజేష్ మృతిచెందాడని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ఆరోపించారు. బుధవారం మంద కృష్ణమాదిగ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని సందర్శించి సూపరింటెండెంట్‌తో కలిసి పలు రికార్డులు పరిశీలించారు. అనంతరం నవంబర్ 15న కర్ల రాజేష్‌కు అందించిన వైద్యం గురించిన వివరాలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజేష్ అందించిన వైద్యంపై పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పేద వర్గాలకు వైద్యం కానీ, చట్టం కానీ సమానంగా ఉండే పరిస్థితి లేదని, దళిత యువకుడు రాజేష్ మృతికి పోలీసుల చిత్రహింసలు, డాక్టర్ల నిర్లక్ష్యమేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఇప్పటి వరకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నుంచి ఎలాంటి స్పందనలేదని, వారు బాధ్యత వహించి కర్ల రాజేష్ కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కేసులో మొదటి ముద్దాయి అయిన చిలుకూరు ఎస్‌ఐ సురేష్‌రెడ్డిని సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు చింతలపాటి చినశ్రీరాములు మాదిగ, రాజన్న మాదిగ, చింత వినయ్ మాదిగ, డప్పు మల్లయ్య మాదిగ, మందుల శ్రీనివాస్ మాదిగ, బోడ సునీల్ మాదిగ, బొజ్జ సైదులు మాదిగ, ములకలపల్లి రవి మాదిగ తదితరులు పాల్గొన్నారు.
ఫ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ


