జాతీయ మహిళా సదస్సులో పాల్గొన్న తుమ్మడం సర్పంచ్‌ | - | Sakshi
Sakshi News home page

జాతీయ మహిళా సదస్సులో పాల్గొన్న తుమ్మడం సర్పంచ్‌

Jan 9 2026 11:19 AM | Updated on Jan 9 2026 11:19 AM

జాతీయ మహిళా సదస్సులో పాల్గొన్న తుమ్మడం సర్పంచ్‌

జాతీయ మహిళా సదస్సులో పాల్గొన్న తుమ్మడం సర్పంచ్‌

నిడమనూరు : మహారాష్ట్రలోని పుణేలో జరుగుతున్న మహిళా స్నేహపూర్వక పంచాయతీల జాతీయ సదస్సులో గురువారం నిడమనూరు మండలం తుమ్మడం గ్రామ సర్పంచ్‌ బుర్రి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సదస్సు విశేషాలను ఆయన విలేకరులతో పంచుకున్నారు. గ్రామ పంచాయతీల్లో మహిళలకు కల్పిస్తున్న అవకాశాలపై 2024–25 సంవత్సరానికి గాను ఉత్తమ గ్రామ పంచాయతీగా తుమ్మడం గ్రామ పంచాయతీ ఎన్నికై ందని, దీంతో కొత్తగా సర్పంచ్‌గా ఎన్నికై న తనకు పుణేలో నిర్వహించిన జాతీయ సదస్సులో పాల్గొనాలని ఆహ్వానం అందడంతో అక్కడకు వెళ్లినట్లు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా నలుగురు సర్పంచులు, నలుగురు ఎంపీడీఓలు, స్థానిక సంస్థల స్పెషల్‌ సెక్రటరీ జాన్‌ వెస్లీ ఈ సదస్సుకు హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement