ట్రాన్స్‌కో, డిస్కమ్ ఇంటర్ సర్కిల్ క్రీడలు ప్రారంభం
నల్లగొండ : నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని మేకల అభివనవ్ స్టేడియంలో బుధవారం తెలంగాణ ట్రాన్స్‌కో, డిస్కమ్ ఇంటర్ సర్కిల్ క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 9వ తేదీ వరకు క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు ఏడీఈ స్పోర్ట్స్ జనరల్ సెక్రటరీ తిరుగుడు శ్రీనివాస్, స్పోర్ట్స్ ఆఫీసర్ నీలం జగన్నాథ్ తెలిపారు. వాలీబాల్ పోటీలకు 12 టీమ్‌లు, ఫుట్‌బాల్‌కు 8, క్యారమ్స్‌కు 12 టీమ్‌లు వివిధ సర్కిళ్ల నుంచి వచ్చినట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఈటీ రాజునాయక్, ఏడీఈ నరేందర్‌రావు, అంజల్‌రావు, సలీం, ఫరూక్, బాలు, ఎన్‌వీ రావు పాల్గొన్నారు.
ట్రాన్స్‌కో, డిస్కమ్ ఇంటర్ సర్కిల్ క్రీడలు ప్రారంభం


