వైభవంగా స్వర్ణగిరీశుడి తిరువీధి ఉత్సవ సేవ
భువనగిరి : పట్టణ శివారులోని స్వర్ణగిరి క్షేత్రంలో గల వేంకటేశ్వరస్వామి దేవాలయంలో బుధవారం రాత్రి స్వామివారికి తిరువీధి ఉత్సవ సేవ వైభవంగా నిర్వహించారు. అంతకుముందు ఆలయంలో ఉదయం సుప్రభాత సేవ, సహస్రనామార్చన, నిత్య కల్యాణం, అష్టదళ పాదపద్మార్చన చేశారు. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆయా పూజా కార్యక్రమాల్లో ఆలయ వ్యవస్థాఽపక ధర్మకర్తలు మానేపల్లి రామారావు, మురళీకృష్ణ, గోపికృష్ణ, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.


