సెమినార్లను సద్వినియోగం చేసుకోవాలి
ఫ ఎంజీయూ వైస్ చాన్స్‌లర్ అల్తాఫ్ హుస్సేన్
రామగిరి(నల్లగొండ) : సెమినార్లను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ(ఎంజీయూ) వైస్ చాన్స్‌లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. నల్లగొండ పట్టణంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో కెమిస్ట్రీ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో ‘న్యూ విస్టాస్ ఆఫ్ కెమిస్ట్రీ– యాన్ ఇంటర్‌డిసిప్లినరీ అప్రోచ్’ అనే అంశంపై రెండు రోజుల పాటు నిర్వహించనున్న అంతర్జాతీయ సెమినార్ బుధవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఎంజీయూ వీసీ హాజరై మాట్లాడారు. అనంతరం విశిష్ట అతిథి ప్రొఫెసర్ జి. సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. కెమిస్ట్రీలో మంచి పరిశోధనలకు అవకాశం ఉందని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో దక్షిణాఆఫ్రికాలోని క్వా జులు యూనివర్సిటీ ప్రొఫెసర్ జొన్నలగడ్డ శ్రీకాంత్, వీరారెడ్డి, ఎన్. రవికుమార్‌రెడ్డి. ఏ. వసంత, వెంకటకృష్ణ, కె. మంజుల, ఏ. దయానంద్, కె. రవికుమార్, కె. నరేష్, పి. ఉపేంద్ర, బొజ్జ అనిల్, ఎం. అనిల్ తదితరులు పాల్గొన్నారు.


