రాష్ట్రపతి భవన్‌లో నృత్య ప్రదర్శనకు ఎంపిక
భూదాన్‌పోచంపల్లి : హైదరాబాద్‌లోని బొల్లారంలో గల రాష్ట్రపతి భవన్‌కు శీతాకాల విడిదిలో భాగంగా త్వరలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్న నేపథ్యంలో ఆమె ముందు కూచిపూడి నృత్య ప్రదర్శన ఇచ్చేందుకు పోచంపల్లి మున్సిపాలిటీకి చెందిన కుమారి బడుగు నిఖితకు అవకాశం లభించింది. బుధవారం లిఖిత రాష్ట్రపతి భవన్‌లో రిహార్సల్స్‌లో పాల్గొందని, ఆమె నృత్య ప్రదర్శనను ఢిల్లీ నుంచి వచ్చిన రాష్ట్రపతి భవన్ అధికారులు చూసి ప్రశంసించినట్లు తండ్రి శివశంకర్ తెలిపారు. గతంలో బడుగు నిఖిత అనేక వేదికల్లో వందలాది ప్రదర్శనలు ఇచ్చి ప్రముఖులచే ప్రశంసలు పొందింది.


