ప్రతిఒక్కరి కంటి సమస్యను తీరుస్తా
మునుగోడు: నియోజకవర్గంలోని ప్రతిఒక్కరి కంటి సమస్యను పరిష్కరిస్తానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. తన తల్లి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం మునుగోడులోని క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 11వ విడుత ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. గ్రామాల్లోని అనేక మంది నిరుపేదలు కంటి సమస్యలతో బాధపడుతున్నారని, వారు కార్పొరేట్ స్థాయి ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకొలేని పరిస్థితిలో ఉన్నారన్నారు. వారందరికీ తన తల్లి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఆపరేషన్లు చేయిస్తున్నానని తెలిపారు. ఇప్పటి వరకు నిర్వహించిన 10 శిబిరాల్లో 7,806 మందికి కంటి పరీక్షలు నిర్వహించి, 1490 మందికి ఆపరేషన్లు చేయించినట్లు చెప్పారు. అవసరమైతే మునుగోడులో అన్ని సౌకర్యాలతో ప్రత్యేక కంటి ఆస్పత్రి నిర్మాణం చేపట్టి నల్లగొండ జిల్లాలోని పేద ప్రజలందరికీ వైద్య సేవలు అందించేలా ఏర్పాటు చేస్తానన్నారు. కార్యక్రమంలో మాజీ డీసీసీబీ అధ్యక్షుడు కుంభం శ్రీనివాస్ రెడ్డి, నాయకులు నారబోయిన రవి, చండూరు మార్కెట్ చైర్మన్ దొటి నారయణ, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భీమనపల్లి సైదులు, పాల్వాయి జితేందర్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి


