కూలీల పొట్టగొట్టేందుకు కొత్త బిల్లు
సూర్యాపేట అర్బన్ : ఉపాధి హామీ కూలీల పొట్టగొట్టేందుకే వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అవిజిక మిషన్ (గ్రామీణ) బిల్లు 2025ను కేంద్రం తీసుకొచ్చిందని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.నాగయ్య ఆరోపించారు. శనివారం సూర్యాపేట పట్టణంలోని ఎంవీఎన్ భవన్‌లో జరిగిన ఆ సంఘం జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ జనవరి 5 నుంచి 10 వరకు ప్రజా ప్రతినిధులకు వినతి పత్రాలు ఇస్తామన్నారు. సంఘం జిల్లా అధ్యక్షులు ములకలపల్లి రాములు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు, జిల్లా ఆఫీస్ బేరర్స్ పులుసు సత్యం, సోమపంగా జానయ్య, పోసనబోయిన హుస్సేన్, జంపాల స్వరాజ్యం, గుంజ వెంకటేశ్వర్లు, జిల్లా కమిటీ సభ్యులు ఆరె రామకృష్ణారెడ్డి, అంజపల్లి లక్ష్మయ్య, ఉయ్యాల పారిజాత, తదితరులు పాల్గొన్నారు.


