వ్యర్థాలతో అద్భుతాలు
ఫ నిత్యం వాడి పారేసే వస్తువులతో
గృహోపకరణాలు తయారు
చేసిన విద్యార్థులు
ఫ వేస్ట్ వెల్త్ ఎగ్జిబిషన్‌లో ఆటకట్టుకున్న ఎగ్జిబిట్లు
రాజాపేట : రాజాపేట మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో శనివారం విద్యాశాఖ, నేషనల్ గ్రీన్ కార్ప్(ఎన్‌జీసీ) ఆధ్వర్యంలో వేస్ట్ వెల్త్ (వావ్) ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ ఎగ్జిబిషన్‌లో యాదగిరిగుట్ట, తుర్కపల్లి, రాజాపేట, మోటకొండూరు, ఆలేరు మండలాలకు చెందిన ఉన్నత పాఠశాలల విద్యార్థులు మనం నిత్యం వాడే ప్లాస్టిక్, ఫ్లైవుడ్, థర్మాకోల్, గాజు, కొబ్బరి పీచు, వాటర్ బాటిల్స్, క్లాత్, ఆవు పేడ, మట్టి, కర్ర ముక్కలతో ఎన్నో రకాల గృహోపకరణాలు, వివిధ రకాల వస్తువులు తయారు చేసి ప్రదర్శించారు. యాదగిరిగుట్ట మండలంలోని యాదగిరిపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన లక్ష్మీప్రసన్న మొదటి బహుమతి, మోటకొండూరు మండల కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన పి. రాకేష్ రెండో బహుమతి, రాజాపేట మండల కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన మధులిక, రాజాపేట మండలం పాముకుంట జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన శోభారాణి మూడో బహుమతి గెలుచుకున్నారు. పారుపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన స్పందన, రఘునాథపురం జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన మహేష్‌కు కన్సోలేషన్ బహుమతులు గెలుచుకున్నారు. విజేతలకు రాజాపేట సర్పంచ్ కోయ మధు, ఉప సర్పంచ్ నెమిల కేదారి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్‌జీసీ స్టేట్ కోఆర్డినేటర్ రాధిక, జిల్లా సైన్స్ ఆఫీసర్ రాజశేఖర్, ఎంఈఓ చందా రమేష్, రాజాపేట జెడ్పీహెచ్‌ఎస్ ప్రధానోపాధ్యాయుడు టి. రాజు, ఆయా పాఠశాలల గైడ్ టీచర్స్ కళ్యాణి, శ్రావణి, అనిత, బాలకృష్ణ, చొల్లేటి శ్రావణ్‌కుమార్, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్‌రెడ్డి, కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు.
వ్యర్థాలతో అద్భుతాలు


