వైకుంఠనాథుడిగా యాదగిరీశుడు
యాదగిరిగుట్ట : యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అధ్యయనోత్సవాలు కనుల పండువగా జరుగుతున్నాయి. శనివారం ఐదో రోజు ఉదయం యాదగిరిశుడిని వటపత్రశాయిగా అలంకరించి ఆలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. అంతకుముందు ఆలయంలో నిత్యారాధనలు జరిపించి, దివ్య ప్రబంధ పారాయణాలను పారాయణీకులచే నిర్వహించారు. సేవోత్సవం అనంతరం స్వామివారి అలంకార సేవను అద్దాల మండపంలో అధిష్ఠించి, వటపత్రశాయి అలంకార విశిష్టతను భక్తులకు ఆచార్యులు వివరించారు. అదేవిధంగా సాయంత్రం ద్రవిడ ప్రబంధ సేవాకాలం పారాయణీకులచే నిర్వహించారు. అనంతరం స్వామిని వైకుంఠనాథుడిగా(పరమపదనాధుడి) అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ తిరు, మాడ వీధిల్లో ఊరేగించారు. ఆయా వేడుకల్లో ఆలయ అధికారులు, ప్రధానార్చకులు, అర్చకులు, పారాయణీకులు, రుత్వికులు, భక్తులు పాల్గొన్నారు.
నేటితో ఉత్సవాలకు ముగింపు
అధ్యయనోత్సవాలు ఆదివారంతో ముగియనున్నాయి. ఉదయం 9గంటలకు లక్ష్మీనరసింహస్వామి అలంకార సేవను ఆలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగిస్తారు. అనంతరం సూత్తందాది చాత్మర నిర్వహించి ఉత్సవాలను పరిసమాప్తి చేయనున్నారు.
ఫ నేటితో ముగియనున్న అధ్యయనోత్సవాలు
వైకుంఠనాథుడిగా యాదగిరీశుడు


