శిలాఫలకాలు ధ్వంసం చేసి అభివృద్ధిని చెరపలేరు
నకిరేకల్ : బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో వేసిన శిలాఫలాకలను ధ్వంసం చేసినంత మాత్రాన తాము చేసిన అభివృద్ధిని చెరపలేరని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నకిరేకల్ మండలం మోదినిగూడెం గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన బీఆర్‌ఎస్ జెండా దిమ్మెను, గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి సంబంధించిన శిలాఫలకాన్ని శనివారం ఆయన పరిశీలించి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్ర పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. నకిరేకల్ నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన పనులకే ప్రస్తుత ఎమ్మెల్యే శంకుస్థానలు చేస్తున్నారు తప్ప కొత్తగా చేసిందేమీ లేదని ఆరోపించారు. గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు అధికార మదంతో చిల్లర వేశాలు వేస్తున్నారన్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పడంతో ఓర్వలేక ఇలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. మితిమీరి ప్రవర్తిస్తున్న అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. అక్రమ కేసులు పెట్టినంత మాత్రాన బీఆర్‌ఎస్ నాయకులు భయపడే వారు కాదన్నారు. మోదినిగూడెంలో జరిగిన ఘటనపై డీజీపీ సమగ్ర రిపోర్టు తెప్పించుకుని బాధ్యులతపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన వెంట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొప్పుల ప్రదీప్‌రెడ్డి, కట్టంగూర్, నకిరేకల్ మాజీ జెడ్పీటీసీలు తలారి బలరాం, మాధ ధనలక్ష్మీనగేష్, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షులు ప్రగడపు నవీన్‌రావు, మారం వెంకట్‌రెడ్డి, బీఆర్‌ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు వలిశెట్టి శ్రీనివాస్, నాయకులు పేర్ల కృష్ణకాంత్, గోర్ల వీరయ్య, నోముల కేశవరాజులు, పల్లె విజయ్, అమీర్‌పాష తదితరులు ఉన్నారు.
ఫ నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే
చిరుమర్తి లింగయ్య


