నకిలీ బంగారం అంటగడుతున్న ముఠా అరెస్టు
నల్లగొండ : అమాయక ప్రజలను నమ్మించి నకిలీ బంగారం అంటగడుతున్న ముఠాను నల్లగొండ వన్‌టౌన్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. శనివారం నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి విలేకరులకు వెల్లడించిన వివరాల ప్రకారం.. నల్లగొండ పట్టణం నెహ్రూగంజ్‌లోని వినాయక కిరాణా దుకాణం వద్దకు డిసెంబరు 16న ఇద్దరు వ్యక్తులు వచ్చి కిరాణా సామాను తీసుకొని, దుకాణ యజమానితో పరిచయం పెంచుకున్నారు. రూ.15లక్షల విలువైన పాత బంగారం కేవలం రూ.5లక్షలకు ఇస్తామని దుకాణ యజమానిని నమ్మించారు. దీంతో షాపు యజమాని బ్యాంకు వద్దకు వెళ్లి రూ.5లక్షలు డ్రా చేసి వారికి ఇవ్వగా.. వారు నకిలీ బంగారం అంటగట్టి ఉడాయించారు. ఆ తర్వాత తనకు నకిలీ బంగారం ఇచ్చారని గుర్తించిన షాపు యజమాని నల్లగొండ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా నిందితులు నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని కతాల్‌గూడెం శివారులో కుటుంబ సభ్యులతో కలిసి గుడిసెలు వేసుకొని నివాసముంటూ ప్లాస్టిక్ వస్తువుల అమ్మకం పేరుతో అమాయక ప్రజలకు నకిలీ బంగారం అంటగడుతున్నట్లు పోలీ సులు గుర్తించి రమేష్‌కుమార్, రాజారామ్, మహేంద్రకుమార్, మానా రామ్, సురేష్‌కుమార్, దేవా రామ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పురన్‌కుమార్ పరారీలో ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. నిందితులంతా రాజస్తాన్ రాష్ట్రానికి చెందిన వారని, వారి నుంచి రూ.1.5 లక్షల నగదు, 6 సెల్‌ఫోన్లు, అర కేజీ నకిలీ బంగారం స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్ప పేర్కొన్నారు.
ఫ రూ.1.5 లక్షల నగదు, 6 సెల్‌ఫోన్లు, అర కేజీ నకిలీ బంగారం స్వాధీనం
ఫ వివరాలు వెల్లడించిన నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి


