ఆలయ స్థానాచార్యులుగా వెంకటాచార్యులు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ స్థానాచార్యులుగా ప్రధానార్చకులు కాండూరి వెంకటచార్యులను నియమిస్తూ ఆలయ ఈఓ వెంకట్రావ్ ఉత్తర్వులు జారీ చేశారు. కొన్నేళ్లుగా యాదగిరి క్షేత్రంలో స్థానాచార్యుల పోస్టు ఖాళీగా ఉన్న నేపథ్యంలో ప్రధానార్చకులుగా విధులు నిర్వహిస్తున్న కాండూరి వెంకటచార్యులును ఫుల్ అడిషనల్ చార్జ్ విధులు కేటాయిస్తున్నట్లు ఈఓ వెల్లడించారు. పాతగుట్ట ఆలయం, యాదగిరీశుడి ఆలయాల్లో రాబోయే బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు సైతం కాండూరి వెంకటచార్యులు ప్రధానార్చకుడితో పాటు స్థానాచార్యుల హోదాలో నిర్వహించనున్నారు. నూతన స్థానాచార్యుల నియామకం భర్తీ అయ్యే వరకు కాండూరి వెంకటచార్యులు ప్రధానార్చకుడితో పాటు ఈ స్థానాచార్యుల పోస్టులో కొనసాగనున్నారు.
కూచిపూడి నృత్య ప్రదర్శన
భువనగిరి : మండలంలోని రాయగిరి గ్రామ సమీపంలో గల మినీ శిల్పారామంలో గురువారం నూతన సంవత్సరం సందర్భంగా రామదుర్గారావు నాట్య బృందం ఆధ్వర్యంలో కూచిపూడి నృత్య ప్రదర్శన ఇచ్చారు. ఈ నృత్య ప్రదర్శన సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో హరిప్రియ, అమూల్య, సూర్యచరణ్, సాయికుమార్, రామదుర్గారావు తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ సభను
జయప్రదం చేయాలి
చండూరు : సీపీఐ ఆవిర్భవించి వంద సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఖమ్మం జిల్లా కేంద్రంలో ఈనెల 18న నిర్వహించే బహిరంగ సభను జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యరద్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పిలుపునిచ్చారు. గురువారం చండూరులోని మాదగోని నర్సింహ భవన్‌లో జరిగిన మునుగోడు నియోజకవర్గ స్థాయి కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. సీపీఐకి వందేళ్ల పోరాట చరిత్ర ఉందన్నారు. పార్టీ నూతన సభ్యత్వాలు చేర్పించాలన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు నలపరాజు రామలింగయ్య, అంజాచారి, తీర్పారి వెంకటేశ్వర్లు, గురిజ రామచంద్రం, బొల్గూరి నరసింహ, మండల కార్యదర్శులు నలపరాజు సతీష్, చాపల శ్రీను, సూదనబోయిన రమేష్, శేఖర్, లాలు, సురిగి చలపతి, పల్లె యాదయ్య, బొడ్డు వెంకటేశ్వర్లు, బరిగెల వెంకటేశ్ పాల్గొన్నారు.
ప్రజలను మభ్యపెట్టే
ప్రయత్నం
భానుపురి (సూర్యాపేట) : కాంగ్రెస్ ప్రభుత్వంలో కృష్ణా, గోదావరి జలాల విషయంలో అన్యాయం జరుగుతోందని అబద్ధాలను పదేపదే చెప్పి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నానికి బీఆర్‌ఎస్ పార్టీ పాల్పడుతోందని తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్‌రెడ్డి ఆరోపించారు. గురువారం సూర్యాపేటలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో తెలంగాణ ఉద్యమం సమయంలోనూ ప్రజలకు అనేక హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని నెరవేర్చకుండా బీఆర్‌ఎస్ నాయకులు మోసం చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కృష్ణా, గోదావరి జలాల విషయంలో అన్యాయం జరుగుతోందని బీఆర్‌ఎస్ నాయకుడు జగదీష్‌రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృష్ణా, గోదావరి నదీ జలాల్లో తెలంగాణకు రావాల్సిన వాటా కోసం న్యాయపోరాటం, రాజకీయ పోరాటం రెండూ చేస్తూ ముందుకు సాగుతున్నారని స్పష్టం చేశారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర జల వనరుల శాఖ మంత్రిని కలిశారని గుర్తు చేశారు.
ఆలయ స్థానాచార్యులుగా వెంకటాచార్యులు
ఆలయ స్థానాచార్యులుగా వెంకటాచార్యులు
ఆలయ స్థానాచార్యులుగా వెంకటాచార్యులు


