పుర ఓటర్లు 1,32,820
3వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ
సాక్షి, యాదాద్రి : జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో ఓటర్ల లెక్క తేలింది. గురువారం మున్సిపల్ కమిషనర్లు ఆయా మున్సిపాలిటీల్లో ఓటరు ముసాయిదా జాబితాను విడుదల చేశారు. మొత్తం 1,32,820 మంది ఓటర్లు ఉండగా.. మహిళలు 67813 మంది, పురుష ఓటర్లు 64,971 మంది, ట్రాన్స్‌జెండర్లు 18 మంది ఉన్నారు. పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు 2,842 మంది అధికంగా ఉన్నారు.
బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు?
ఈసారి మున్సిపల్ ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిన నిర్వహించనున్నారు. ఇందుకోసం ఎన్నికల కమిషన్ బ్యాలెట్ బాక్స్‌ల స్టాకు వివరాలను జిల్లా అధికారుల నుంచి అడిగినట్లు తెలిసింది. 2019లో అంతకు ముందు మున్సిపల్ పోలింగ్‌ను ఈవీఎంల ద్వారా నిర్వహించిన విషయం తెలిసిందే. ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా పోస్టల్ బ్యాలెట్ ద్వారా నిర్వహించిన విషయం తెలిసిందే.
వార్డుకు రెండు పోలింగ్ కేంద్రాలు
ముసాయిదా జాబితాలో ఓటర్ల సంఖ్యతో పాటు వార్డుల సంఖ్య, పోలింగ్ కేంద్రాల సంఖ్యను ప్రకటించారు. గత మున్సిపాలిటీలో ఉన్న 104 వార్డులే ప్రస్తుతం ఉన్నాయి. కొత్తగా వార్డులు పెరుగలేదు. పెరిగిన ఓటర్లను ఆయా వార్డుల్లో సర్దుబాటు చేశారు. ప్రతి వార్డుకు రెండు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
ఫ ముసాయిదా జాబితా ప్రకటించిన అధికారులు
ఫ పురుషుల కంటే 2842 మంది మహిళా ఓటర్లు అధికం
ఫ 3వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ
ముసాయిదా ఓటరు జాబితాపై అభ్యంతరాలను ఈనెల 3వ తేదీ వరకు మున్సిపల్ కార్యాలయాల్లో నమోదు చేయాలి. ఓటర్లు తమకున్న అభ్యంతరాలను మున్సిపాలిటీల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్లలో అందించాలి. అక్కడి నుంచి వారు ఏఈఆర్‌ఓలకు పంపించి పరిష్కరిస్తారు. 4వ తేదీన మున్సిపాలిటీల్లో, 5న కలెక్టర్ కార్యాలయంలో రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేయనున్నారు. 10న తుది జాబితాను ప్రకటిస్తారు.
మున్సిపాలిటీల వారీగా ఓటర్ల జాబితా ఇలా..
మున్సిపాలిటీ పురుషులు సీ్త్రలు మొత్తం వార్డులు
ఆలేరు 6,691 6,978 13,670 12
చౌటుప్పల్ 13,553 13,663 27,216 20
మోత్కూరు 7,117 7,299 14,416 12
పోచంపల్లి 7,808 8,031 15,839 13
యాదగిరిగుట్ట 6,762 7,043 13,821 12
భువనగిరి 23,040 24,799 47,840 35


