చేనేత రుణమాఫీకి సీఎం ఆమోదం
మోత్కూరు : చేనేత కార్మికుల రుణమాఫీకి సీఎం రేవంత్‌రెడ్డి ఆమోదం తెలిపినట్లు చేనేత జౌళి శాఖ కమిషనర్ శైలజా రామయ్యర్ చెప్పారని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వనం శాంతికుమార్, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు పేర్కొన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో కమిషనర్ శైలజ రామయ్యార్‌ను వారు కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చేనేత రుణమాఫీ గురించి బ్యాంకు అధికారులతో ప్రభుత్వం మాట్లాడిందని, వడ్డీ మాఫీ చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. రుణమాఫీకి కావాల్సిన రూ.15వేల కోట్లకు ముఖ్యమంత్రి ఆమోదించారని, త్వరలో ఆర్థిక శాఖ నుంచి అనుమతులు రాగానే రుణమాఫీ జరుగుతుందని కమిషనర్ తెలిపినట్లు వారు చెప్పారు.


