ముగిసిన ధాన్యం కొనుగోళ్లు
భువనగిరి: వానాకాలం సీజన్‌కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ముగిసింది. జిల్లాలోని 17 మండలాల్లో సుమారు 3లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. 3.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా.. 49,086 మంది రైతుల నుంచి 3.18లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా పీఏసీఎస్, ఐకేపీ, ఎఫ్‌పీఓలు కలిపి మొత్తం 330 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో ఐకేపీల ద్వారా 1,32,590, పీఏసీఎస్ ద్వారా 1,65,597, ఎఫ్‌పీఓల ద్వారా 17,444, మెప్మా ద్వారా 2,972 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇందులో ఫైన్ రకం ధాన్యం10201 మెట్రిక్ టన్నులు, గ్రేడ్– ఏ రకం 1,13,176 మెట్రిక్ టన్నులు, సాధారణ రకం ఽ1,95,226 మెట్రిక్ టన్నులు ఉంది.
రూ.7.57కోట్ల చెల్లింపులు
జిల్లాలో 49,086 మంది రైతుల నుంచి రూ.7.57 కోట్ల విలువ చేసే ధాన్యాన్ని కొనుగోలు చేయగా ఇప్పటివరకు రూ.7.45కోట్లు 48,797 మంది రైతుల ఖాతాల్లో జమచేశారు. మిగిలిన డబ్బులు రెండు, మూడు రోజుల్లో రైతుల ఖాతాల్లో జమ అవుతాయని జిల్లా సివిల్ సప్లయ్ మేనేజర్ హరికృష్ణ తెలిపారు.
యాసంగి వరినాట్లలో బిజీ
యాసంగి సీజన్‌కు సంబంధించి వరినాట్లు ఊపందుకున్నాయి. ఈ సీజన్‌కు జిల్లా వ్యాప్తంగా 3,25,000 ఎకరాల్లో వరి సాగయ్యే అవకాశం ఉంటుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఈ సారి కురిసిన భారీ వర్షాల కారణంగా చెరువులు, కుంటలు నిండటంతో భూగర్భ జలాల మట్టం పెరిగింది. దీనితోడు మూసీ ఆధారిత ప్రాంతాల్లో నీటి ప్రవాహం వల్ల అంచనాలకు మించి వరి సాగయ్యే అవకాశం ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు. గత సంవత్సరం యాసంగి సీజన్‌లో వరి సాగు విస్తీర్ణం 3.09 లక్షల ఎకరాలు ఉండగా ఈ సారి 3.25 లక్షల ఎకరాల వరి సాగు అయ్యే అవకాశం ఉంటుందని అంచనా వేశారు.
ఫ 3.18లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
ఫ 48,797 మంది రైతుల ఖాతాల్లో రూ.7.45కోట్లు జమ
ఫ ముమ్మరమైన యాసంగి వరినాట్లు


