గురుకుల విద్యార్థుల ప్రతిభ
నార్కట్‌పల్లి : నార్కట్‌పల్లిలోని మహాత్మా జ్యోతిబా పూలే మూసీ రెసిడెన్షియల్ బాలుర జూనియర్ కళాశాల విద్యార్థులు ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు తుర్కపల్లిలో జరిగిన రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ మీట్‌లో పాల్గొని ప్రతిభ చూపారు. కబడ్డీలో ఎస్.వినయ్, వాలీబాల్‌లో జి.మధు, ఎస్.ఈశ్వర్, జె.లవకుమార్‌లు ప్రతిభ చూపారు. హైజంప్‌లో ఎస్.వినయ్ ప్రతిభ కనబరిచి ఇంటర్ సొసైటీ స్పోర్ట్స్ మీట్‌కు ఎంపికయ్యాడని గురువారం కళాశాల ప్రిన్సిపాల్ అసానబాద విద్యాసాగర్ తెలిపారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ఏటీపీ వి.శివశంకర్, డిప్యూటీ వార్డెన్ భార్గవి, పీడీ వెంకట్, కళాశాల సిబ్బంది అభినందించారు.


