రైల్లో నుంచి జారి పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి
భువనగిరి : రైల్లో నుంచి జారి పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన వలిగొండ–నాగిరెడ్డిపల్లి రైల్వే స్టేషన్ల మధ్య జరిగింది. గురువారం రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం మధ్యాహ్నం వలిగొండ–నాగిరెడ్డిపల్లి రైల్వే స్టేషన్ల మధ్య రైలు పట్టాలపై గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందినట్లు వచ్చిన సమాచారం మేరకు రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు ప్రమాదవశాత్తు రైల్లో నుంచి జారి పడి ఉండవచ్చని రైల్వే పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. మృతుడి వయస్సు సుమారు 38 ఏళ్లు ఉంటాయని, 5.5 అడుగుల ఎత్తు, ఆర్‌ఆర్‌ఆర్ బిర్యానీ హౌస్ పేరు గల టీ షర్ట్, నలుపు రంగు ప్యాంట్ ధరించి ఉన్నట్లు పేర్కొన్నారు. మృతుడి వద్ద సికింద్రాబాద్ టు భువనేవ్వర్ వెళ్లే రైలు టిక్కెట్ ఉన్నట్లు చెప్పారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 98482 22169 నంబర్‌ను సంప్రదించాలని భువనగిరి రైల్వే పోలీస్ ఇన్‌చార్జి జే. కృష్ణరావు తెలిపారు.
చికిత్స పొందుతూ..
చిలుకూరు: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. చిలుకూరు మండలం బేతవోలు గ్రామానికి చెందిన దేశబోయిన శ్రీను(55) ఈ నెల 22న బేతవోలు నుంచి జెర్రిపోతులగూడెం రోడ్డులో బైక్‌పై వెళ్తుండగా.. తన ముందు ఉన్న బైక్‌ను అకస్మాత్తుగా ఆపడంతో శ్రీను బైక్ అదుపుతప్పి కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో శ్రీను తలకు తీవ్ర గాయాలయ్యాయి. చిక్సిత నిమిత్తం అతడిని ఖమ్మంకు తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్‌ఐ వెంకటేశ్వరరావు తెలిపారు.
పామాయిల్ తోట దగ్ధం
రామగిరి(నల్లగొండ) : షార్ట్ సర్క్యూట్‌తో పామాయిల్ తోట దగ్ధమైంది. ఈ ఘటన నల్లగొండ పెద్ద సూరారం గ్రామంలో గురువారం వెలుగులోకి వచ్చింది. పెద్ద సూరారం గ్రామానికి చెందిన రైతు కోట్ల విష్ణువర్ధన్‌రెడ్డి ఐదేళ్ల క్రితం మూడెకరాల భూమిలో 180 పామాయిల్ చెట్లను నాటాడు. పామాయిల్ తోట మీదుగా 11కేవీ హై టెన్షన్ విద్యుత్ లైన్ వెళ్తోంది. బుధవారం మధ్యాహ్నం విద్యుత్ వైర్లపై పక్షి వాలడంతో షార్ట్ సర్క్యూట్ జరిగి పక్షి కాలిపోయి తోటలో పడింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడం వల్ల 150 చెట్లు, డ్రిప్ పైపులు మంటల్లో కాలిపోయాయి. రూ.5 లక్షల వరకు నష్టం వాటిల్లిందని బాధిత రైతు పేర్కొన్నాడు. విద్యుత్ వైర్లు లూజ్ ఉండడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు రైతు ఆరోపిస్తున్నాడు.
రైల్లో నుంచి జారి పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి
రైల్లో నుంచి జారి పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి


