దాడి ఘటనపై విచారణ జరిపించాలి
ఫ నల్లగొండ ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌కి
గొడకొండ్ల గ్రామ సర్పంచ్ వినతి
నల్లగొండ: తాను సర్పంచ్‌గా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం నిర్వహించిన ర్యాలీలో కొందరు వ్యక్తులు బీరు సీసాలు, రాళ్లతో దాడులకు పాల్పడ్డారని, ఈ ఘటనపై విచారణ జరిపించాలని చింతపల్లి మండలం గొడకొండ్ల గ్రామ సర్పంచ్ కాశగోని వెంకటయ్య గురువారం జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌కు వినతిపత్రం అందజేశారు. పంచాయతీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన తాను 22న ప్రమాణ స్వీకారం తర్వాత చింతపల్లి ఎస్‌ఐ అనుమతితో ర్యాలీ చేస్తుండగా.. కొంతమంది దుండగులు మద్యం తాగి బీరు సీసాలు, రాళ్లతో దాడి చేసి గాయపరిచారని ఆయన ఎస్పీకి వివరించారు. అర్ధగంట తర్వాత చింతపల్లి ఎస్‌ఐ తన సిబ్బందితో వచ్చి లాఠీచార్జి చేసి మహిళలును, పురుషులు, యువకులను విచక్షణారహితంగా కొట్టారని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియోలు ఉన్నాయని, ఎస్‌ఐ కక్షపూరితంగా వ్యవహరించి చదువుకునే విద్యార్థులపై కేసులు నమోదు చేశారని ఎస్పీకి వివరించారు. ఈ ఘటనపై విచారణ చేసి దాడి చేసిన దుండగులను శిక్షించడంతో పాటు ఎస్‌ఐ లాఠీచార్జిపై విచారించి కూడా విచారించాలని కోరారు. ఎఫ్‌ఐఆర్‌లో 50 మంది విద్యార్థులతో పాటు వృద్ధుల పేర్లు చేర్చినట్లు తెలిసిందన్నారు.
పార్వతీదేవి వేషధారణలో ఆర్‌ఏఎఫ్ జవాన్
గరిడేపల్లి : గరిడేపల్లి మండలం సర్వారం గ్రామానికి చెందిన రాపిడ్ యాక్షన్ ఫోర్స్ జవాన్ బత్తిని సుధాకర్ కేరళ రాష్ట్రంలోని శబరిమల క్షేత్రంలో విధులు నిర్వహిస్తూ పార్వతీదేవి వేషధారణలో కనిపించారు. అయ్యప్ప మాలధారణతో శబరిమలకు వచ్చే భక్తుల మధ్య అయ్యప్ప స్వామి తల్లి పార్వతీదేవి వేషంలో సుధాకర్ దర్శనమివ్వడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సుధాకర్ భద్రతా విధులు నిర్వహిస్తూనే తన భక్తి భావాన్ని చాటుకున్నారు.
సూర్యాపేట వాసి నిర్మించిన చిత్రానికి మంచి స్పందన
ఫ సందేశాత్మక చిత్రం తీశారని
మెచ్చుకున్న ప్రేక్షకులు
సూర్యాపేట : సూర్యాపేట జిల్లాకు చెందిన ఇమ్మడి సోమనర్సయ్య నిర్మాతగా రూపొందించిన ‘బ్యాడ్ గర్ల్స్’ చిత్రం గురువారం సూర్యాపేట పట్టణంలోని తిరుమల మల్టీప్లెక్స్‌లో ప్రదర్శితమైంది. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న వివక్షను, వారికి జరుగుతున్న అన్యాయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతిఒక్కరికి కనువిప్పు కలిగేలా బ్యాడ్ గర్ల్స్ చిత్రాన్ని నిర్మించారని పలువురు మహిళా ప్రేక్షకులు కితాబు ఇచ్చారు. సినిమాలో చూపించినట్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో మహిళల ఆత్మరక్షణకు అవసరమైన శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.
దాడి ఘటనపై విచారణ జరిపించాలి


