మానవాళిపై దేవుడి ప్రేమకు తార్కాణమే క్రిస్మస్
మఠంపల్లి : మానవాళి పట్ల దేవుని అపారమైన ప్రేమకు తార్కాణమే క్రిస్మస్ అని ఎన్‌ఆర్‌ఐ, రిటైర్డ్ రెవరెండ్ ఫాదర్ అల్లం మర్రెడ్డి అన్నారు. గురువారం ఆయన మఠంపల్లిలోని శుభవార్త చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొని దివ్యబలిపూజ నిర్వహించి క్రైస్తవులకు సందేశం ఇచ్చారు. ఏసుక్రీస్తు జననం ఎంతో అద్భుతమని అన్నారు. జనులను రక్షించేందుకు ఏసుక్రీస్తు ఎన్నో కష్టాలు అనుభవించాడని, ప్రజలంతా ఏసు మార్గంలో నడవాలని కోరారు. అనంతరం క్రైస్తవులకు దివ్య ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా భక్త బృందం ఆలపించిన క్రైస్తవ గేయాలు ఆకట్టుకున్నాయి. మధ్యాహ్నం చర్చిలో కొవ్వొత్తుల సమర్పణగావించారు. సాయంత్రం తేరుపై బాలయేసు, మేరీమాత ప్రతిమలతో పురవీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఫాదర్లు రాజారెడ్డి, అశోక్, చర్చికమిటీ పెద్దలు ఆదూరి కిషోర్‌రెడ్డి, లూర్దుమారెడ్డి, ఆంథోనిరెడ్డి, బాలరెడ్డి, జయభారత్‌రెడ్డి, టీఆర్ బాలశౌరెడ్డి, థామస్‌రెడ్డి, ఇన్నారెడ్డి, జార్జిరెడ్డి, శౌరెడ్డి, మధుసూదన్‌రెడ్డి, లూర్దురెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మానవాళిపై దేవుడి ప్రేమకు తార్కాణమే క్రిస్మస్


