సీట్ల కోసం భక్తుల పాట్లు
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు గురువారం అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకొని సాయంత్రం వివిధ ప్రాంతాలకు తిరుగు ప్రయాణంలో ఆధ్యాత్మిక వాడలోని బస్టాండ్, పట్టణంలోని బస్టాండ్, కొండపైన బస్టాండ్‌లో భక్తులు బస్సుల కోసం వేచి ఉన్నారు. బస్టాండ్‌లోకి బస్సులు ఒక్కొక్కటిగా రావడంతో సీట్ల కోసం భక్తులు పోటీ పడ్డారు. సాయంత్రం వేళ చలి పెడుతున్న సమయంలో భక్తులు చాలా మంది బస్సుల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రద్దీకి అనుగుణంగా బస్సులు నడిపించడంలో అధికారులు విఫలమయ్యారని భక్తులు విమర్శించారు.


