స్వర్ణగిరికి పోటెత్తిన భక్తులు
భువనగిరి : భువనగిరి పట్టణ శివారులోని స్వర్ణగిరి క్షేత్రంలో గల వేంకటేశ్వరస్వామి దేవాలయానికి గురువారం భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనానికి సుమారు గంటన్నరకు పైగా సమయం పట్టినట్లు భక్తులు పేర్కొన్నారు. అంతకుముందు ఉదయం స్వామి వారికి సుప్రభాత సేవ, తోమాల సేవ, సహస్రనామార్చన, నిత్య కల్యాణం జరిపించారు. అదేవిధంగా సాయంత్రం తిరువీధి ఉత్సవ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో రద్దీతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. ఆయా పూజా కార్యక్రమాల్లో ఆలయ అర్చకులతో పాటు భక్తులు పాల్గొన్నారు.


