
మంత్రుల ధ్యాసంతా పైరవీలపైనే ఽ
చౌటుప్పల్ : మంత్రులకు ప్రజా సమస్యలకంటే పైరవీలపైనే ధ్యాస ఎక్కువని, ఎవరికి వారు దుకాణాలు తెరిచారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. హామీల అమలు, అభివృద్ధిని విస్మరించారని విమర్శించారు. చౌటుప్పల్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని సోమవారం మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో చేతగాని ప్రభుత్వం ఉందన్నారు. ఆచరణకు సాధ్యంకాని హామీలిచ్చి అమలు చేయకుండా డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతుందన్నారు. ఎరువులు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నా సకాలంలో తెప్పించుకోకుండా నిందలు మోపే ప్రయత్నం చేస్తుందని ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి కర్రుకాల్చి వాతలు పెట్టడం ఖాయమన్నారు.
సైనికుల్లా పని చేయాలి
స్థానిక సంస్థల్లో మెజార్టీ స్థానాలు గెలుచుకునేందుకు కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్‌రెడ్డి కోరారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజ ల్లోకి తీసుకెళ్లాలన్నారు.ఈ కార్యక్రమంలో నల్లగొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి, యాదాద్రి జిల్లా ఉపాధ్యక్షుడు రమనగోని శంకర్, మునుగోడు అసెంబ్లీ కన్వీనర్ దూడల భిక్షంగౌడ్, మండల, మున్సిపల్ కమిటీ అధ్యక్షుడు కై రంకొండ అశోక్, కడారి కల్పన, నాయకులు గుజ్జుల సురేందర్‌రెడ్డి,ముత్యాల భూపాల్‌రెడ్డి, చినుకని మల్లేష్, ఊడుగు యాదయ్య, కంచర్ల గోవర్ధన్‌రెడ్డి, రాధారపు సత్తయ్య, కాయితి రమేష్, కడారి అయిలయ్య తదితరులు పాల్గొన్నారు.
ఫ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్‌రెడ్డి