‘ఇందిరమ్మ’ పేరు.. అక్రమాల జోరు! | - | Sakshi
Sakshi News home page

‘ఇందిరమ్మ’ పేరు.. అక్రమాల జోరు!

Aug 25 2025 7:45 AM | Updated on Aug 25 2025 9:15 AM

‘ఇంది

‘ఇందిరమ్మ’ పేరు.. అక్రమాల జోరు!

మోటకొండూర్‌ మండల

కేంద్రంలో వాగులు లేకపోవడంతో ఇందిరమ్మ ఇంటికి ఇసుక దొరకడం లేదు. దీంతో ట్రాక్టర్‌కు రూ.3,500 వెచ్చించి ప్రైవేట్‌గా మూడు ట్రిప్పుల ఇసుక పోయించిన. ఆ తరువాత ఆలేరు వాగు

నుంచి ఇసుక రవాణా చేయాలని తహసీల్దార్‌ కార్యాలయంలో నాలుగు ట్రిప్పులకు పర్మిషన్‌ తీసుకున్న. అందులో ట్రాక్టర్‌ రూ.2,500 చొప్పున రెండు ట్రిప్పులే పోశారు. ఇసుక సరిపోక టన్నుకు రూ.2వేలు చెల్లించి రెండు టన్నులు పోయించుకున్న. జిల్లాలో చాలా చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది.

మోటకొండూర్‌: ఇందిరమ్మ ఇళ్ల పేరిట ఇసుక వ్యాపారం జోరుగా సాగుతోంది. వాగులు, వంకల నుంచి పెద్ద ఎత్తున ఇసుక తోడేస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రతి ఇంటికి దశలవారీగా 10 ట్రాక్టర్ల ఇసుక ఇవ్వాలని ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు ఉన్నాయి. కానీ, వ్యాపారులు రెండు,మూడు ట్రాక్టర్లు మాత్రమే లబ్ధిదారులకు పోసి మిగతా ట్రిప్పులను ప్రైవేట్‌కు అమ్ముకుంటున్నారు. జిల్లాలోని ఇక్కుర్తి, దిలావర్‌పూర్‌, మాటూర్‌, అమ్మనబోలు, తేర్యాల, బేగంపేట, ఆలేరు, బిక్కేరు.. ఇలా అన్ని వాగుల నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది.

బ్లాక్‌లో ట్రాక్టర్‌ రూ.5వేలకు అమ్మకం

మోటకొండూర్‌ మండలానికి 276 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా 236 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం అయ్యాయి. ఇందులో 94 మంది లబ్ధిదారులు ఇసుక కోసం తహసీల్దార్‌ కార్యాలయంలో పర్మిషన్‌ పొందారు. ఒక్కో ట్రాక్టర్‌కు గరిష్టంగా రూ.2వేలకు మించి తీసుకోద్దని రెవెన్యూ అధికారులు ఇసుక వ్యాపారులకు నిబంధన విధించారు. కానీ, లబ్ధిదారుల పేరున పదుల సంఖ్యలో ట్రాక్టర్లకు అనుమతి పొంది అందులో ఎక్కువ మొత్తం బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తున్నారు. ఒక ట్రాక్టర్‌ ఇసుక రూ.5వేలకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని చోట్ల రెవెన్యూ అధికారుల అనుమతితో తరలించిన ఇసుకను లబ్ధిదారులకు చెందకుండా రహస్య ప్రాంతాల్లో డంప్‌ చేస్తున్నారు. అక్కడి నుంచి రాత్రి వేళల్లో లారీల ద్వారా సరిహద్దులు దాటిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో జరుగుతున్న ఇసుకదందా వల్ల గ్రామాల్లో ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి.

రైతులపైనే కేసులు!

స్థానిక వాగుల్లో ఇసుక నిల్వలు సరిపడా లేకపోవడంతో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు వేర్వేరు గ్రామాల పరిధిలో ఉన్న వాగుల నుంచి తీసుకెళ్లడానికి అనుమతి పొందుతున్నారు. ఈ క్రమంలోనే మోటకొండూరు మండలం తేర్యాల వాగులో ఇసుక కోసం వేర్వేరు గ్రామాలకు చెందిన ఐదుగురు లబ్ధిదారులు మోటకొండూరు తహసీల్దార్‌ కార్యాలయంలో పర్మిషన్‌ తీసుకున్నారు. 22,23 తేదీల్లో ఉదయం తేర్యాల వాగు నుంచి ఏకంగా 30 మంది కూలీలతో ట్రాక్టర్ల ద్వారా లబ్ధిదారులు ఇసుక తరలించారు. సమీప రైతులు, గ్రామస్తులు అడ్డుకుని లేబర్‌ను పంపించారు. అదే రోజు మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో తిరిగి ఇసుక తరలించడం ప్రారంభించగా పక్కనున్న ఓ రైతు ఆక్షేపించాడు. ఈ క్రమంలో ట్రాక్టర్‌ డ్రైవర్ల, రైతుకు ఘర్షణ చోటు చేసుకుంది. సదరు రైతు అన్నదమ్ములు, సమీపంలో ఉన్న కొందరు గ్రామస్తులు గమనించి సంఘటన స్థలానికి వచ్చి డ్రైవర్లతో గొడవకు దిగారు. చివరికి ఈ గొడవ పోలీస్‌ స్టేషన్‌కు చేరింది. ట్రాక్టర్‌ డ్రైవర్‌ ఫిర్యాదు మేరకు ఏడుగురు రైతులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

వాగులను తోడేస్తున్న వ్యాపారులు

అధిక ధరకు బ్లాక్‌లో ఇసుక విక్రయం

తేర్యాల గ్రామంలో అడ్డుకున్న

రైతులతో ట్రాక్టర్‌ డ్రైవర్ల ఘర్షణ

ఏడుగురు రైతులపై కేసులు నమోదు చేసిన పోలీసులు

‘ఇందిరమ్మ’ పేరు.. అక్రమాల జోరు!1
1/1

‘ఇందిరమ్మ’ పేరు.. అక్రమాల జోరు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement