
పథకాలన్నీ చేనేతకూ వర్తింపజేయాలి
సంస్థాన్ నారాయణపురం: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ చేనేత కుటుంబాలకు కూడా వర్తింపజేయాలని అఖిల భారత పద్మశాలి సంఘం రాజకీయ విభాగం చేనేత జాతీయ ఇంచార్జి, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు బొల్ల శివశంకర్ కోరారు. అఖిలభారత పద్మశాలి సంఘం రాజకీయ విభాగం, తెలంగాణ పద్మశాలి సంఘం సంయుక్తంగా హైదారాబాద్ నుంచి చేపట్టిన చేనేత నేతన్న యాత్ర సంస్థాన్ నారాయణపురం మీదుగా ఆదివారం పుట్టపాకకు చేరుకుంది. సంస్థాన్ నారాయణపురంలో కొండా లక్ష్మణ్‌బాపూజీ, పుట్టపాకలో అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. చేనేత వస్త్రాలను పరిశిలించారు. పురుషులు, మహిళలు చేనేత వస్త్రాలు ధరించి ప్యాషన్ ర్యాంప్ వాక్ చేసి ఆకట్టుకున్నారు. జాతీయ చేనేత అవార్డు గ్రహీతలు గూడ పవన్, గజం నర్మదను సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జాతీయ ఇంచార్జి బొల్ల శివశంకర్ మాట్లాడుతూ రాజకీయ పదవుల్లో పద్మశాలీలకు ప్రాధాన్యమివ్వాలన్నారు. కేంద్ర ప్రభుత్వం వస్త్రాలపై విధించిన జీఎస్‌టీని రద్దు చేయాలని, రాష్ట్రం ప్రకటించినట్లుగా రూ.లక్ష వరకు రుణమాపీ చేయాలని కోరారు. రాష్ట్రంలోని చేనేత కార్మికులందరికీ జియో ట్యాగ్ కల్పించాలని, అర్హులందరికీ పింఛన్ ఇవ్వాలని, చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత అభివృద్ధికి ప్రత్యేక ఎగ్జిబిషన్‌లు ఏర్పాటు, చేనేత సంబంధిత కార్పొరేషన్ పదవులు ఇవ్వాలన్నారు. పద్మశాలి సంఘం రాష్ట్ర ఆధ్యక్షుడు కమర్తపు మురళీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ చేనేతకు అనేక పథకాలు అమలు చేస్తుందని, రూ.33 కోట్ల రుణాలు మాఫీ చేసిందన్నారు. రూ.680 కోట్ల విలువైన 1.28 కోట్ల చీరల తయారీకి సిరిసిల్ల పద్మశాలి సంఘానికి అర్డర్ ఇవ్వడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో అఖిలభారత పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి గడ్డం జగన్నాథం, మహిళాప్రధాన కార్యదర్శి చిలువేరు సునీత, పద్మశాలి సంఘం రాష్ట్ర కార్యదర్శి రామచందర్‌రావు, మహిళా ఆధ్యక్షురాలు గుంటక రూప, బొమ్మ ప్రవళ్లిక, అవ్వారి భాస్కర్, మాచర్ల రామచందర్, జిల్లా ఆధ్యక్షుడు చిక్క వెంకటేశ్వర్లు, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు సామల విజయలక్ష్మి, గజం పుష్పలత, సామల భాస్కర్, గజం హనుమంతు, సత్యనారా యణ, వెంకటేశ్వర్లు, శంకర్, బాలసుబ్రహ్మణ్యం చంద్రశేఖర్, సమత, తిరుమల, అశ్విత, సునీత, పద్మ, లక్ష్మి, విశ్వరేఖ తదితరలు పాల్గొన్నారు.
అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ ఇంచార్జి బొల్ల శివశంకర్
పుట్టపాకకు చేరిన నేతన్న యాత్ర