
100 మందికి పదోన్నతులు
భువనగిరి: ఉపాధ్యాయ పదోన్నతుల ప్రక్రియ కొ లిక్కి వచ్చింది. 100 మంది ఎస్‌జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పపదోన్నతి లభించనుంది. జాబితాలో పేర్లు ఉన్న ఉపాధ్యాయులు సోమవారం వెబ్ ఆప్షన్ పెట్టుకోనున్నారు. వారికి మంగళవారం డీఈఓ చేతుల మీదుగా ఆర్డర్ కాపీలు అందజేయనున్నారు.
ఒక్కొక్కరు రెండు, మూడు పోస్టులకు అర్హత
ఉపాధ్యాయుల్లో చాలామంది గణితం, భౌతిక శాస్త్రం, ఫిజిక్స్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్ చేశారు. వీరు మూడు పోస్టులకు అర్హత పొందుతున్నారు. 1:3 నిష్పత్తి ప్రకారం సీనియార్టీ జాబితా తయారు చేయడంతో ఇలాంటి సమస్య వచ్చింది. దీంతో అధికారులు ఈనెల 23న వారిని పిలిచి ఒక్కటే ఎంపిక చేసుకోవాలని సూచించి అంగీకార పత్రాలు తీసుకున్నారు.అనంతరం సీనియార్టీ జాబితా ప్రకటించి ఆదివారం అభ్యంతరాలు స్వీకరించారు. అభ్యంతరాలు రాకపోవడంతో తుది జాబితా ప్రకటించారు.
పాఠశాలల వారీగా పదోన్నతులు
జెడ్పీ, ప్రభుత్వ 163, ప్రాధమికోన్నత 68, ప్రాథమిక పాఠశాలలు 484 ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో 2,939 ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఇందులో 100 మంది ఎస్టీజీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి లభించింది. ఇందులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో 76, ప్రాథమిక పాఠశాలల్లో 20, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో నలుగురు ఉన్నారు.
కొలిక్కి వచ్చిన ఉపాధ్యాయ ప్రమోషన్లు
నేడు వెబ్ ఆప్షన్లకు అవకాశం
రేపు ఆర్డర్ కాపీలు అందజేత