
పేదలకు మెరుగైన వైద్యమే లక్ష్యం
యాదగిరిగుట్ట: పేదలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని యాదగిరిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సీఎస్‌ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన ఆర్‌ఓ ప్లాంట్‌ను ఆదివారం వారు ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యానికి ప్రాధాన్యం ఇస్తుందన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా తేడా ఉందని.. ప్రజాప్రభుత్వంలో అన్ని రంగాలకు ప్రాధాన్యం దక్కుతుందన్నారు. 24 గంటలు వైద్యసేవలు అందించేలా వైద్యసిబ్బంది కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి పావని, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు పోత్నాక్ ప్రమోద్‌కుమార్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు నీలం పద్మ, మండల అధ్యక్షుడు సత్యనారాయణ, పట్టణ అధ్యక్షుడు భిబిక్షపతి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ కాటబత్తిని ఆంజనేయులు, నాయకులు గుండ్లపల్లి భరత్‌గౌడ్, పెలిమెల్లి శ్రీధర్‌గౌడ్, ముక్కెర్ల మల్లేష్, ఆకుల గణేష్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.