
వాహనదారులపై వడ్డన
తిరుమలగిరి (తుంగతుర్తి) : రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రవాణా శాఖ సేవా రుసుములు పెంచింది. గతంతో పోలిస్తే దాదాపు రెట్టింపు చేస్తూ గత నెల 22న జీఓ నంబర్ 51 విడుదల చేసింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించి ఆర్టీఏ సర్వర్‌లో మార్పులు చేశారు. జీఓ విడుదలైన వెంటనే సూర్యాపేట జిల్లాలోని సూర్యాపేట, కోదాడ ఆర్టీఏ కార్యాలయాల్లో పెంచిన రుసుములతో సేవలు అందుబాటులోకి వచ్చాయి. రవాణా శాఖ అధికారులు పెరిగిన రుసుముల వివరాలు కార్యాలయం నోటీస్ బోర్డుపై ఏర్పాటు చేశారు. ఈ నిర్ణయంతో రవాణా శాఖకు ఆదాయం, వాహనదారులపై ఆర్థిక భారం పెరిగింది.
ప్రతిరోజూ 200 దరఖాస్తులు
సూర్యాపేట జిల్లాలోని సూర్యాపేట, కోదాడ ఆర్టీఏ కార్యాలయాల్లో ప్రతిరోజూ సరాసరి 200 దరఖాస్తులు వస్తుంటాయి. రవాణా శాఖ సేవా రుసుము పెంపు నిర్ణయంతో జిల్లా రవాణా శాఖకు ఆదాయం పెరిగింది. వాహనం నడిపే సమయంలో డ్రైవింగ్ లైసెన్స్, లెర్నింగ్ లైసెన్స్, వాహనాల రిజిస్ట్రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాల్సిందే. సొంతంగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని ఆర్టీఏ కార్యాలయానికి వచ్చే వారికి సేవా రుసుము ఆన్‌లైన్ ఫీజు మాత్రమే ఉంటుంది. ఏజెంట్ల ద్వారా సేవలు పొందితే మరింత భారం తప్పేలా లేదు.
దరఖాస్తు చార్జీల పెంపు
రాష్ట్ర ప్రభుత్వం రవాణా శాఖకు సంబంధించి నూతన వాహనాల రిజిస్ట్రేషన్లు, డ్రైవింగ్, లెర్నింగ్ లైసెన్స్, పర్మిట్, సామర్థ్య పరీక్షలతోపాటు ఇతర సేవలపై అదనపు చార్జీలతోపాటు పన్నులను సైతం పెంచింది. వాహనం ఇన్వాయిస్ ధర ప్రకారం నూతన వాహనాల రిజిస్ట్రేషన్ పన్నులు పెంచారు. గతంలో రూ.50 మాత్రమే ఉండగా.. రూ.500 లోపు పన్నుకు రూ.50, రూ.500 కంటే ఎక్కువ ఉంటే రూ.100 అదనంగా వసూలు చేస్తున్నారు.
పెంచిన చార్జీలు ఇలా..
ఫ లెర్నింగ్ లైసెన్స్ పరిమితి 6 నెలలు కాగా.. గతంలో రూ.100 ఉండగా ప్రస్తుతం రూ.200 చేశారు.
ఫ డ్రైవింగ్ లైసెన్సులకు సంబంధించిన పీవీసీ స్మార్ట్ కార్డుల సేవా రుసుము ఐదేళ్ల కాల పరిమితికి లైట్ మోటారు వాహనం రూ.200 నుంచి రూ.300కు, 20ఏళ్ల లోపు నాన్ ట్రాన్స్‌పోర్టు వాహనాలకు రూ.300 నుంచి రూ.400కు పెంచారు.
ఫ వాహనాల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి పీవీసీ, స్మార్ట్ కార్డులకు నాన్ ట్రాన్స్‌పోర్టు వాహనాలకు 0.5 శాతం, ట్రాన్స్‌పోర్టు వాహనాలకు 0.1 శాతం పన్ను, 3 చక్రాల వాహనాలకు ఏడాదిలోపు రూ.250 నుంచి రూ.300లకు, ఏడాది కంటే ఎక్కువగా ఉంటే రూ.300 నుంచి రూ.500 వరకు అదనపు చార్జీలు విధించారు.
ఫ ఫిట్‌నెస్ ధ్రువీకరణ పత్రాల మంజూరుకు రెండేళ్లలోపు రూ.100 నుంచి రూ.200, రెండేళ్లకుపైన రూ.200 నుంచి రూ.300లకు పెంచారు.
ఫ వాహన పర్మిట్ చార్జీలను గతంలో ఉన్న చార్జీల కంటే రూ.100 చొప్పున అదనంగా వసూలు చేస్తున్నారు.
సేవా రుసుములు
పెంచిన రవాణా శాఖ
ఫ గతంలో కంటే రెట్టింపు చేస్తూ జీఓ జారీ
ఫ ఆన్‌లైన్‌లో దరఖాస్తు
చేసుకుంటే ఫీజు తక్కువే..
ఫ ఏజెంట్ల ద్వారా వెళ్తే మరింత
ఆర్థిక భారం