
ఎరువు.. ధరల బరువు
హోల్‌సేల్ డీలర్ల
మాయాజాలం
మూడు బస్తాలే ఇచ్చారు
సాక్షి, యాదాద్రి : జిల్లాకు కేటాయించిన యూరియా 60శాతం పీఏసీఎస్‌లు, రైతు ఆగ్రో సేవా కేంద్రాలు, 40 శాతం రిటైల్ డీలర్ల ద్వారా రైతులకు అందిస్తున్నారు. అయితే బస్తా యూరియా ఎమ్మార్పీ రూ.266 ఉండగా రూ.50 అదనంగా వసూలు చేస్తున్నారు. దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉండగా.. జిల్లాలో యూరియా నిల్వలు ఉన్నప్పటికీ సరఫరాలో కొన్ని చోట్ల జాప్యం జరుగుతోంది. మరికొన్ని చోట్ల లింక్‌లు వద్దన్న వారికి స్టాక్ లేదని కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు.
అధిక ధరలకు విక్రయం
జిల్లాలో పీఏసీఎస్, ఎరువుల డీలర్లు ఎమ్మార్పీ రూ.266కే అమ్మినట్లు రశీదు ఇస్తున్నారు. కానీ హమాలీ ఖర్చుల పేరుతో పీఏసీఎస్‌లు, రైతు ఆగ్రో సేవా కేంద్రాలు, డీలర్లు సుమారు రూ. 50 వరకు అధికంగా వసూలు చేస్తున్నారు. దీంతోపాటు మూడు యూరియా బస్తాలకు ఒక దుబ్బ గుళికలు, లేదా పది కిలోల గుళికల బకెట్ అంటగడుతున్నారు. కొన్ని చోట్ల నానో డీఏపీ డబ్బాలు లింక్ పెట్టగా, మరికొందరు డీలర్లు పురుగు మందులు తీసుకుంటేనే యూరియా ఇస్తామని లింక్ పెట్టి రైతుల నుంచి డబ్బులు దండుకుంటున్నారు.
అక్రమ తరలింపుపై నిఘా
హోల్‌సేల్ డీలర్ల నుంచి యూరియా పరిశ్రమలకు తరలిపోతుందన్న సమాచారం పై ప్రభుత్వం తనిఖీలకు సిద్ధమైంది. వ్యవసాయ శాఖ, పోలీస్, పరిశ్రమ శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించనున్నారు. ప్రధానంగా ప్లాస్టిక్, ఫార్మా, ఎక్స్‌ప్లోజివ్స్ ఇలా జిల్లాలో ఉన్న 30 వరకు పరిశ్రమల్లో తనిఖీలకు ఆదేశించారు.
పంటల వివరాలు (ఎకరాల్లో)
జిల్లాలో హోల్‌సేల్ డీలర్లు మాయాజాలం కొనసాగుతోంది. కంపెనీల సేల్స్ ఆఫీసర్లు తమ లింక్ అమ్మకాలను పెంచుకోవడానికి యూరియాను రిటేల్ డీలర్లకు అడిగినంత ఇవ్వడం లేదు. భువనగిరి, దేవరకొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, నల్లగొండ, నేరడుచర్లలో గల హోల్‌సేల్ డీలర్లకు కంపెనీల నుంచి నేరుగా టన్నుల కొద్ది లారీల యూరియా వస్తోంది. దీంతో హోల్‌సేల్ డీలర్లు నిర్ణయించిన ధర ఫైనల్ అవుతోంది.
ఫ ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు యూరియా అమ్మకం
ఫ లింక్ మందులు వద్దంటే నోస్టాక్ అంటున్న డీలర్లు
ఫ యూరియా నిల్వలు ఉన్నప్పటికీ కొన్ని చోట్ల సరఫరాలో జాప్యం
జిల్లాలో సాగు అంచనా : 4,40,500
ఇప్పటివరకు సాగైన పంటలు : 3,42,659
పంటలు సాగు అంచనా సాగైంది
వరి 2,95,000 2,06,523
పత్తి 1,15,000 1,07,710
కంది 6,000 3,037
ఇతర పంటలు : 2,53,000
నేను ఆరు ఎకరాల్లో వరి పొలం సాగు చేశాను. పీఏసీఎస్‌లో మూడు బస్తాలు మాత్రమే ఇచ్చారు. మిగతా మూడు బస్తాల కోసం మరో మూడు రోజుల తర్వాత రమ్మని అధికారులు చెబుతున్నారు. వర్షం పడడంతో యూరియా అవసరం ఏర్పడింది. అందుబాటులో లేకపోవడంతో తిరగాల్సి వస్తోంది.
– ఎడవల్లి కనకయ్య, తుర్కపల్లి, రైతు
యూరియా అవసరం :
21,000 మెట్రిక్ టన్నులు
జిల్లాకు వచ్చిన యూరియా : 17,202 మెట్రిక్ టన్నులు
ఇప్పటివరకు వాడింది
: 14,808 మెట్రిక్‌టన్నులు
అందుబాటులో ఉన్నది
: 2,514 మెట్రిక్ టన్నులు

ఎరువు.. ధరల బరువు

ఎరువు.. ధరల బరువు