
బీఆర్‌ఏఓయూలోఅనేక కోర్సులు
రామన్నపేట : దేశంలో ఎక్కడాలేని విధంగా అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం విద్యార్థుల కోసం అనేక కోర్సులను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని యూనివర్సిటీ జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ ధర్మానాయక్ తెలిపారు. మంగళవారం రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని స్టడీ సెంటర్‌ను సందర్శించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. వివిధ కారణాల వల్ల ఉన్నత విద్యకు దూరమైన వారు, వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఓపెన్ యూనివర్సిటీలో చేరి ఉన్నత విద్యను అభ్యసించాలని సూచించారు. ఓపెన్ డిగ్రీ పట్టా రెగ్యూలర్ డిగ్రీతో సమానమన్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాహత్‌ఖానం, స్టడీ సెంటర్ కో ఆర్డినేటర్ డాక్టర్ చిన్నబాబులు ఆయనను శాలువాతో సన్మానించి పూలమొక్కను అందజేశారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ పి.వెంకటేశ్వర్‌రావు, కౌన్సిలర్లు అమర్, ప్రశాంత్, నరేష్, ఆంజనేయులు, శ్రీనివాసులు పాల్గొన్నారు.