
యాదగిరి క్షేత్రంలో ఏకాదశి పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఏకాదశిని పురస్కరించుకుని మంగళవారం లక్ష పుష్పార్చన పూజను పాంచరాత్ర ఆగమశాస్త్రానుసారం నిర్వహించారు. ఆలయ ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులను పుష్పాలు, తులసీ దళాలతో లక్ష పుష్పార్చన పూజ జరిపించారు. భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.
క్షేత్రపాలకుడికి నాగవల్లి దళార్చన
యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి క్షేత్రపాలకుడిగా ఉన్న శ్రీఆంజనేయస్వామికి అర్చకులు ఆకుపూజను విశేషంగా నిర్వహించారు. ప్రధానాలయంతో పాటు విష్ణు పుష్కరిణి వద్ద, పాతగుట్ట ఆలయాల్లో సింధూరం పాటు క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం సిఽంధూరంతో అలంకరించిన ఆంజనేయస్వామిని అలంకరించి, నాగవల్లి దళార్చన చేపట్టారు. ఇక ప్రధానాలయంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం, సాయంత్రం వెండి జోడు సేవ పూజలు జరిపించారు.