
ఈ నెలలో మూడు సార్లు వాగు వచ్చింది
నేను కొరటికల్‌లో ఉంటాను. ఆత్మకూరు(ఎం)లో మీ సేవా నిర్వహిస్తాను. మా గ్రామానికి మూడు కిలో మీటర్ల దూరంలో ఆత్మకూరు(ఎం) ఉంటుంది. ఈ నెలలో మూడు సార్లు వాగు వచ్చింది. వాగు ఉధృతి ఎక్కువగా ఉండటంతో కొన్ని సార్లు మీ సేవ కేంద్రాన్ని తెరవలేకపోయాను. తప్పని పరిస్థితుల్లో పక్క గ్రామం నుంచి 13 కిలోమీటర్ల దూరం తిరిగిపోయాను. – నాగుల ఆంజనేయులు,
మీసేవా కేంద్రం నిర్వాహకుడు, కొరటికల్
మాది రహీంఖాన్‌పేట. నేను గీత కార్మికుడిని. కల్లు గీస్తేనే మాకు జీవనాధారం. వాగు అవతల తాటిచెట్లు ఉన్నాయి. కల్లు గీసేందుకు తాటి చెట్లు ఎక్కుదామని వెళ్తే వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో వెనక్కి వచ్చేశా. – ముత్యాల మల్లయ్య,
గీత కార్మికుడు, రహీంఖాన్‌పేట

ఈ నెలలో మూడు సార్లు వాగు వచ్చింది

ఈ నెలలో మూడు సార్లు వాగు వచ్చింది