
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
చౌటుప్పల్ : జీవితాలను చిత్తుచేసే మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ విష్ణుమూర్తి అన్నారు. మంగళవారం చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెం గ్రామంలో గల దివీస్ పరిశ్రమలో మత్తు పదార్ధాలకు వ్యతిరేకంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా గంజాయి, డ్రగ్స్, మాదకద్రవ్యాలు వంటి మత్తు పదార్ధాలకు దూరంగా ఉంటామని, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములమవుతామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ మాట్లాడుతూ.. మత్తు పదార్థాల విక్రయాలను ఎక్కడికక్కడ అడ్డుకోవాలని సూచించారు. విక్రయాలకు సంబందించిన సమాచారం తెలిస్తే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఆరోగ్యవంతమైన సమాజం కోసం ప్రతి పౌరుడు బాధ్యత తీసుకోవాలన్నారు. అవగాహన సదస్సు నిర్వహించిన దివీస్ పరిశ్రమ అధికారులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో దివీస్ జనరల్ మేనేజర్ పెండ్యాల సుధాకర్, ఎకై ్సజ్ సీఐ బాలాజీనాయక్, ఎస్‌ఐ శంకర్ పాల్గొన్నారు.
ఫ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ విష్ణుమూర్తి