
భద్రతా ప్రమాణాలు పాటించాలి
సాక్షి,యాదాద్రి : జిల్లాలోని ప్రమాదకర కర్మాగారాల్లో భద్రతా ప్రమాణాలు పాటించాలని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని మినీ మీటింగ్ హాల్లో ప్రభుత్వ అధికారులు, వివిధ పరిశ్రమల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రసాయన ఔషధ పరిశ్రమల్లో ఇటీవల చోటు చేసుకున్న ప్రమాదాలు ప్రాణనష్టం కలిగించాయని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఫ్యాక్టరీల్లో రియాక్టర్లు, పేలుడు ఉపశమన పానళ్లు, భద్రత వంటివి కచ్చితంగా ఉండాలని సూచించారు. కార్మికులకు నిరంతరం భద్రతా శిక్షణా కార్యక్రమాలు, మాక్ డ్రిల్స్ నిర్వహించాలని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కరరావు, రెవెన్యూ డివిజనల్ అధికారి కృష్ణారెడ్డి, డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ శ్రీదేవి, అగ్నిమాపక అధికారి మధుసూదన్ రావు, పరిశ్రమల ప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ హనుమంతరావు