
డ్రమ్ సీడర్ పద్ధతితో ఉపాధి
8 ఎకరాల్లో విత్తనాలు వేస్తున్నాం
ఐదేళ్లుగా ఉపాధి పొందుతున్నాం
నడిగూడెం: వ్యవసాయంలో కూలీలు కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు పెట్టుబడులు కూడా బాగా పెరిగాయి. పంటల సాగులో కొత్త పద్ధతులు వస్తుండడంతో రైతులకు ఉపయోగకరంగా మారాయి. పెన్‌పహాడ్ మండలం చీదెళ్ల గ్రామానికి చెందిన పలువురు యువకులు ఒక బృందంగా ఏర్పడి జిల్లాలోని పలు గ్రామాల్లో తిరుగుతూ డ్రమ్ సీడర్ పద్ధతి ద్వారా వరి సాగు చేస్తూ ఉపాధి పొందుతున్నారు.
రోజుకు 7 నుంచి 8 ఎకరాల్లో..
చీదెళ్ల గ్రామానికి చెందిన తండు ప్రవీణ్, వేర్పుల వీరబాబు, వేల్పుల మధు, వరికల్లు శ్రీను ఒక బృందంగా ఏర్పడి స్వయం ఉపాధి పొందాలనే ఉద్దేశంతో నాలుగు డ్రమ్ సీడర్‌లు కొనుగోలు చేశారు. వీరు గత ఐదేళ్ల నుంచి సూర్యాపేటతో పాటు కోదాడ, హుజూర్‌నగర్ ప్రాంతాల్లోని నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధఙలోని గ్రామాల్లో డ్రమ్ సీడర్ పద్ధతి ద్వారా రైతుల భూముల్లో నేరుగా వరి విత్తనాలు విత్తుతున్నారు. దీనికి గాను ఎకరానికి రూ.1000 చొప్పున రోజుకు నాలుగు డ్రమ్ సీడర్‌లతో 7 నుంచి 8 ఎకరాల్లో వరి విత్తనాలు విత్తుతున్నారు. దీంతో ఆ నలుగురు కలిసి ఒక్కొక్కరు రోజుకు రూ.1500 నుంచి రూ.2000 వరకు సంపాదిస్తూ స్వయం ఉపాధి పొందుతున్నారు. వానాకాలం, యాసంగి సీజన్‌లలో నాలుగు నెలల వరకు పని ఉంటుందని వారు చెబుతున్నారు.
రోజుకు 7 నుంచి 8 ఎకరాల్లో డ్రమ్ సీడర్‌ల ద్వారా వరి విత్తనాలు వేస్తున్నాం. రోజుకు మాకు రూ.1500 నుంచి రూ.2000 వరకు కూలీ గిట్టుబాటు అవుతుంది.
– వేర్పుల వీరబాబు, చీదెళ్ల
ఐదేళ్ల క్రితం స్నేహితులతో కలిసి నాలుగు డ్రమ్‌సీడర్‌లు కొనుగోలు చేశాం. మా మండలంలోని పలు గ్రామాల్లో విత్తనాలు వేశాక, రైతుల ద్వారా పక్క మండలాల్లో కూడా విత్తనాలు వేస్తున్నాం. ఒక ఎకరంలో విత్తనాలు వేస్తే ఎకరానికి రూ.1000 చెల్లిస్తున్నారు. దీంతో గత ఐదు సంవత్సరాలుగా ఉపాధి పొందుతున్నాం.
– తండు ప్రవీణ్, చీదెళ్ల
ఫ ఆదర్శంగా నిలుస్తున్న
చీదెళ్ల గ్రామ యువకులు

డ్రమ్ సీడర్ పద్ధతితో ఉపాధి

డ్రమ్ సీడర్ పద్ధతితో ఉపాధి

డ్రమ్ సీడర్ పద్ధతితో ఉపాధి