
దేశభక్తి, సేవాభావం పెంపొందించుకోవాలి
రామన్నపేట: విద్యార్థులు ఎన్‌సీసీలో చేరి దేశభక్తితో పాటు సత్ప్రవర్తన, సేవాభావం పెంపొందించుకోవాలని 31(టీ) బెటాలియన్ కల్నల్ టి. లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం విద్యార్థులకు ఎన్‌సీసీలో ప్రవేశం కొరకు దేహధారుడ్య, రాత పరీక్ష నిర్వహించారు. ఎన్‌సీసీలో చేరిన విద్యార్థులకు ఉన్నత చదువులు, ఆర్మీ, పోలీసు ఉద్యోగాలు పొందడానికి మెరుగైన అవకాశాలు ఉంటాయని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ రాహత్‌ఖానం, ఎన్‌సీసీ ఆఫీసర్ డాక్టర్ రాచమల్ల శ్రీను, బెటాలియన్ సుబేదార్ మేజర్ మాధవరావు, సుబేదార్ కొమ్ము మల్లయ్య, హవల్దార్లు సురేష్, అజయ్‌కుమార్ పాల్గొన్నారు.