రాష్ట్రస్థాయి బేస్‌బాల్‌ పోటీల్లో మూడో స్థానం | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి బేస్‌బాల్‌ పోటీల్లో మూడో స్థానం

Aug 20 2025 5:00 AM | Updated on Aug 20 2025 5:00 AM

రాష్ట

రాష్ట్రస్థాయి బేస్‌బాల్‌ పోటీల్లో మూడో స్థానం

నల్లగొండ: నల్లగొండలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్‌ పాఠశాలలో ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం చదువుతున్న పి .కీర్తన రాష్ట్రస్థాయి బేస్‌బాల్‌ పోటీల్లో సత్తాచాటింది. ఈ నెల 16, 17, 18 తేదీల్లో ఆదిలాబాద్‌ జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి సీనియర్‌ బేస్‌బాల్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో పాల్గొని 3వ స్థానం సాధించింది. కీర్తనను మంగళవారం ప్రిన్సిపాల్‌ కుతేజుల్‌ కుబ్ర, అధ్యాపకులు అభినందించారు.

శ్వాస మీద ధ్యాసతోనే

సంపూర్ణ ఆరోగ్యం

సూర్యాపేట: శ్వాస మీద ధ్యాసతోనే ఆరోగ్యంగా ఉంటామని సంత్‌సదానంద గిరి మహారాజ్‌ స్వామీజీ అన్నారు. మంగళవారం గుంటూరు నుంచి వరంగల్‌ వెళ్తూ మార్గమధ్యలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జమ్మిగడ్డలో గల పిరమిడ్‌ ట్రస్ట్‌ ధ్యాన మందిరాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి వ్యక్తి ధ్యానం చేస్తూ ఆరోగ్యముక్తిని పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్‌ ట్రస్ట్‌ అధ్యక్షురాలు తోట నాగమణి, ప్రధాన కార్యదర్శి గుండా వెంకటేశ్వర్లు, కోశాధికారి చందా విశ్వనాథం, ఉపాధ్యక్షులు కోటగిరి రాధాకృష్ణ, కక్కిరేణి రవిచంద్ర, హరిప్రసాద్‌, దయాసాగర్‌, శ్రీనివాస్‌, విజయ్‌, సువర్ణ, కేదారేశ్వరి, సంధ్య, మహేందర్‌రెడ్డి, సరిత తదితరులు పాల్గొన్నారు.

అప్పుల బాధతో

మహిళ ఆత్మహత్య

భువనగిరి: అప్పుల బాధతో ఉరేసుకుని మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన భువనగిరి మండలం బొల్లేపల్లి గ్రామంలో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బొల్లేపల్లి గ్రామానికి చెందిన ఈర్లపల్లి మాధవి(35), నర్సింహ భార్యాభర్తలు. అప్పులు ఎక్కువ కావడంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. సోమవారం సాయంత్రం అప్పుల విషయమై ఇద్దరూ గొడవ పడ్డారు. దీంతో మనస్తాపానికి గురైన మాధవి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కొద్ది సమయం తర్వాత ఇంట్లోకి వచ్చిన వారి కుమారుడు గమనించి స్థానికులకు సమాచారం అందించాడు. స్థానికులు వచ్చి చూడగా.. అప్పటికే మాధవి మృతిచెందింది. మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ అనిల్‌కుమార్‌ తెలిపారు. మృతిరాలికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉంది.

వాహనం ఢీకొని

రెండు ఆవులు మృతి

త్రిపురారం: వాహనం ఢీకొని రెండు ఆవులు మృతిచెందాయి. ఈ ఘటన త్రిపురారం మండల కేంద్రంలో మంగళవారం జరిగింది. ఎస్‌ఐ నరేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని రాజమండ్రి నుంచి కొబ్బరికాయల లోడుతో జడ్చర్లకు వెళ్తున్న అశోక్‌ లేలాండ్‌ వాహనం త్రిపురారం మండల కేంద్రంలో రెండు ఆవులకు ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రెండు ఆవులు అక్కడికక్కడే మృతిచెందాయి. డ్రైవర్‌ అజాగ్రత్త వల్లనే ప్రమాదం జరిగిందని బాధిత రైతు వలసాని సైదులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నరేష్‌ తెలిపారు.

రాష్ట్రస్థాయి బేస్‌బాల్‌  పోటీల్లో మూడో స్థానం1
1/1

రాష్ట్రస్థాయి బేస్‌బాల్‌ పోటీల్లో మూడో స్థానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement