
ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి
ఫ తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రపుల్ రాంరెడ్డి
సూర్యాపేట: తెలంగాణ రాష్ట్ర సాధనలో పాల్గొన్న ఉద్యమకారులకు ప్రభుత్వం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల ప్రపుల్ రాంరెడ్డి, తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పిడమర్తి లింగయ్య అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బ్రహ్మాండ్లపల్లి కల్యాణ మండపంలో మంగళవారం టీయూ జేఏసీ, తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉద్యమకారుల జేఏసీ జిల్లా అధ్యక్షుడు కోడి సైదులుయాదవ్ అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసులకు, పోలీసు తూటాలకు భయపడకుండా పాల్గొన్నామని గుర్తు చేశారు. ఉద్యమకారులను గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ఉద్యమకారులకు 250 గజాల ఇళ్ల స్థలం, నాలుగు గదుల ఇళ్ల నిర్మాణం, రూ.30వేల పెన్షన్ సౌకర్యం కల్పించి, ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు అందజేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఉద్యమకారులకు కార్పొరేట్ స్థాయిలో ఉచితంగా విద్య, వైద్యం, రూ.20 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలు చేయాలని లేని పక్షంలో మరో ఉద్యమానికి శ్రీకారం చూడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీయూ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు చంద్రన్న ప్రసాద్, క్రిస్టోఫర్, బి. లావణ్య, వైస్ ప్రెసిడెంట్‌లు అంజలికుమారి, హరిప్రసాద్, వర్కింగ్ ప్రెసిడెంట్ తుల్జారెడ్డి, సలహాదారులు శంకర్‌రావు, తెలంగాణ సినిమా వేదిక రాష్ట్ర అధ్యక్షుడు లారా, కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి, తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యూసుఫ్, రాష్ట్ర అధికార ప్రతినిధి లక్కపాక కృష్ణ, రాష్ట్ర కార్యదర్శి జటంగి సౌనయ్య, రాష్ట్ర సహాయ కార్యదర్శి మేడబోయిన గంగయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి పులిగుజ్జు రామచంద్రయ్య, టీయూ జేఏసీ ఎగ్జిక్యూటివ్ మెంబర్లు గోనే విజయ, కమ్మంపాటి లక్ష్మమ్మ, తెలంగాణ ఉద్యమకారుల మహిళా వేదిక జిల్లా అధ్యక్షురాలు తండు దేవిక, జిల్లా ప్రధాన కార్యదర్శి నోముల ఉమా, పట్టణ అధ్యక్షురాలు బంటు ఎల్లమ్మ, ప్రధాన కార్యదర్శి సుజాత తదితరులు పాల్గొన్నారు.