
బుద్ధవనం సందర్శించిన ఉత్తరప్రదేశ్ ప్రతినిధులు
నాగార్జునసాగర్: నాగార్జునసాగర్‌లోని బుద్ధవనాన్ని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు మంగళవారం సందర్శించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కౌశాంబి జిల్లాలో 10 ఎకరాల్లో బుద్ధవనం తరహాలో థీమ్ పార్కు నిర్మించునున్న నేపథ్యంలో ఆ ప్రాజెక్టు కోఆర్డినేటర్ శైలేంద్రసింగ్ ఆధ్వర్యంలో నిపుణుల బృందం బుద్ధవనం సందర్శించారు. వీరికి బుద్ధవనం ఎగ్జిక్యూటివ్ ఆఫసీర్ శాసన, ఎస్టేట్ మేనేజర్ రవిచంద్ర స్వాగతం పలికారు. యమునా నది తీరంలో ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి ప్రాంతంలో జ్ఞానసిద్ధికై సిద్దార్ధుడు మూడేళ్ల పాటు తపస్సు చేశాడని.. అంతటి ప్రసిద్ధమైన ప్రదేశంలో రూ.80కోట్ల వ్యయంతో బుద్ధిష్ట్ థీమ్ పార్కు నిర్మించనున్నట్లు శైలేంద్రసింగ్ తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు దీనిని పూర్తిచేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. వారి వెంట ఆర్కిటెక్ట్ రాహుల్, ఇంజనీర్ కళ్యాణ్‌చంద్ర, స్తపతి గిరీష్‌తివారి ఉన్నారు. వీరికి గైడ్ సత్యనారాయణ బుద్ధవనం గురించి వివరించారు.