
శ్రమించే విద్యార్థులకే ఉపాధి అవకాశాలు
నల్లగొండ టూటౌన్: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి శ్రమించే విద్యార్థులకే ఉపాధి అవకాశాలు లభిస్తాయని మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. సోమవారం నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరంలో విద్యార్థుల ఓరియంటేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఇంజనీరింగ్ కోర్సుల విధి విధానాలు, ప్లేస్‌మెంట్ సెల్, స్కిల్ డెవలప్‌మెంట్ సెల్, ఇన్‌స్టిట్యూట్ ఇండస్ట్రీ కనెక్ట్, స్టూడెంట్ వెల్ఫేర్ విభాగాల గురించి అవగాహన కల్పించారు. విద్యార్థులు 75 శాతం హాజరు పాటిస్తూ విశ్వవిద్యాలయం అందించే కరిక్యులం, నైపుణ్యాల పెంపునకు ఏర్పాటు చేసిన సదుపాయాలు ఉపయోగించుకోవాలని సూచించారు. టెక్నాలజీని లక్ష్యసాధనకు వినియోగించి వ్యసనాల బారిన పడకుండా యువత దేశాభివృద్ధికి తోడ్పడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సీహెచ్. సుధారాణి, అధ్యాపకులు రేఖ, ఎం. జయంతి, టి. మౌనిక, అవినాష్, హరీష్ కుమార్, విజయ్‌కుమార్, రామచంద్రుడు, డైరెక్టర్లు వై. ప్రశాంతి, శ్రీదేవి, తిరుమల తదితరులు పాల్గొన్నారు.
ఎంజీయూ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్