
వానజోరు.. వరద హోరు
సాధారణం కంటే అధికం..
జిల్లాను ముంచెత్తిన వర్షం.. గుండాలలో 16 సెం.మీ వర్షపాతం నమోదు
జిల్లాలోనే అతి పెద్దదైన గంధమల్ల చెరువు మత్తడి దుంకుతోంది. యాసంగి సీజన్‌కు సాగునీటికి స మస్య ఉండదని రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఎగువన ఉన్న జగ్‌దేవ్‌పూర్‌లో కురిసిన భారీ వర్షానికి ధర్మారం మీదుగా గంధమల్ల చెరువులోకి భారీగా వరద నీరు చేరుతోంది. 0.5 టీఎంసీల నీటి నిల్వ సామర్ధ్యం గల ఈ చెరువు అలుగుపోస్తుండడంతో రాజాపేట, యాదగిరిగుట్ట, ఆలేరు వాగు పారుతోంది.
మొన్నటి వరకు చుక్క నీరు లేని శామీర్‌పేట వాగు పరవళ్లు తొక్కుతోంది. ఈ వాగునుంచి భువనగిరి, బీబీనగర్ పెద్ద చెరువుల్లోకి నీరు చేరే కత్వ వద్ద షెట్టర్ల గేట్‌లు ఎత్తారు. భువనగిరి ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌రెడ్డి గంగమ్మకు పూజలు చేసిన కత్వ షెట్టర్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. కాగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఉద్దెమర్రి, మూడుచింతలపల్లి గ్రామాల నుంచి వస్తున్న వరద ఉధృతితో బొమ్మలరామారం మండలం తిమ్మప్ప చెరువు, ప్యారారం, సోలిపేట చెరువులు అలుగుపోస్తున్నాయి. కంచల్‌తండాకు వెళ్లే లింకు రోడ్డు తెగిపోయింది.బండకాడిపెల్లి చెక్‌డ్యాం వద్ద వరద ఉధృతి అధికంగా ఉంది. భువనగిరి, బీబీనగర్ మండలాల్లో చిన్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది.లో లెవల్ కాజ్‌వేల వద్ద రాకపోకలు నిలిపివేశారు.
ఫ పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు
ఫ పలుచోట్ల కోతకు గురైన రోడ్లు, చెరువులు, కుంటలకు గండ్లు
ఫ లోతట్టు ప్రాంతాలు జలమయం
ఫ లో లెవల్ వంతెనల పైనుంచి
వరద నీరు.. రాకపోకలకు ఇక్కట్లు
ఫ వెల్వర్తి వద్ద యువకుడు గల్లంతు
ఫ అప్రమత్తమైన యంత్రాంగం
సాక్షి, యాదాద్రి : వారం రోజులుగా కురుస్తున్న ముసురు వానలకు తోడు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. ఆదివారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు కురిసిన భారీ వర్షానికి రికార్డ్ స్థాయిలో కురిసిన వర్షానికి చెరువులు, కుంటలు జలకళను సంతరించుకుంటున్నాయి. మొన్నటి వరకు చుక్కనీరు లేని శామీర్‌పేట, చిన్నేరు వాగులు పరవళ్లు తొక్కుతున్నాయి. బిక్కేరుకు వరద పోటెత్తింది. మూసీ ఉధృతంగా ప్రవహిస్తోంది. ఐదు మండలాల్లో 10 సెంటీ మీటర్లకు పైగా వర్షం కురిసింది. ఆగస్టు నెలలో సాధారణ వర్షపాతం 80 మి.మీ కాగా.. 18వ తేదీ నాటికి 326 మీ.మీ వర్షపాతం నమోదైంది.అదనంగా 246 మీ.మీ వర్షం కురిసింది.
ఐదు మండలాల్లో ఈ సీజన్‌లోనే అధికం
● వర్షానికి మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బృందావన్ కాలువ వరదతో మోత్కూరు పెద్ద చెరువు నిండి అలుగుపోస్తుంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నార్కట్‌పల్లి రోడ్డులో ఉన్న ఓ భవనం అండర్‌గ్రౌండ్‌లోకి మోకాలు లోతు నీరు చేరింది. ఇందిరానగర్‌లోని ప్రాథమిక పాఠశాల ఆవరణలో భారీగా వరద నీరు చేరడంతో సెలవు ప్రకటించారు.
● గుండాల మండలంలో 16 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. ఈ సీజన్‌లో అతిపెద్ద వర్షం కావడంతో మండలంలో చెరవులు, కుంటలు జలకళ సంతరించుకుంటున్నాయి. మండల పరిధిలో బిక్కేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. తుర్కలషాపురం, గుండాల, రామారం,గంగాపురం, మాసాన్‌పల్లి ఊర చెరువులు అలుగు పోస్తున్నాయి. గుండాల కొత్తకుంటకు గండి పడింది.
● అడ్డగూడూరు మండలం కోటమర్తి, ధర్మారం చెరువులు నిండి అలుగుపోస్తున్నాయి. నక్కలవాగు లోలెవల్ వంతెనపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. కోటమర్తి శివారులో బిక్కేరు వాగు ఉధృతంగా పారుతోంది.
● ఆత్మకూర్ (ఎం) మండలంలోని రాపాక, ఆత్మకూర్, కప్రాయపల్లి, రహీంఖాన్‌పేట, రాయిపల్లి చెరువుల్లోకి నీరు భారీగా చేరుతోంది. చాడ నుంచి మోదుగుబాయిగూడెం వరకు బిక్కేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. లో లెవల్ కాజ్‌వేల పైనుంచి నీరు పారుతోంది.
● యాదగిరిగుట్ట మండలం చొల్లేరు –మర్రిగూడెం మధ్యన గల వాగుపై ఉదృతంగా వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలను నిలిపివేశారు. చొ ల్లేరు గ్రామ ప్రజలు లోలెవల్ వంతెన దాటలేక ఏ డు కిలో మీటర్లు చుట్టూతిరిగి ప్రయాణిస్తున్నారు.
అలుగుపోస్తున్న 119 చెరువులు
జిల్లాలో 1,155 చెరువులు ఉన్నాయి. సోమవారం సాయంత్రానికి 119 చెరువులు అలుగులు పోస్తున్నాయి. 153 చెరువులు అలుగు పోయడానికి సిద్ధంగా ఉన్నాయి. 179 చెరువులు 75 శాతం, 234 చెరువులు 50 శాతం, 470 చెరువులు 25 శాతం వరకు నిండాయి. ఇందులో వంద ఎకరాల ఆయకట్టు ఉన్న చెరువులు 159 ఉండగా అందులో అలుగులు పోస్తున్నచెరువులు 40 వరకు ఉన్నాయి.
గుండాల 160.8
ఆత్మకూర్ 14.0
తుర్కపల్లి 121.4
అడ్డగూడూరు 120.4
మోత్కూరు 118.6
బి.రామారం 116.4
యాదగిరిగుట్ట 91.2
భువనగిరి 87.8
బీబీనగర్ 60.8
ఆలేరు 33.2
వలిగొండ 74.6
రామన్నపేట 29.2
నారాయణపురం 20.8
పోచంపల్లి 24.8
చౌటుప్పల్ 30.6
రాజాపేట 42.0
మోటకొండూరు 60.8
సగటున 78.4
యువకుడు గల్లంతు
మోత్కూరు: వలిగొండ మండలం వెల్వర్తి శివారులో చెరువు అలుగు వరద నీటిలో ఓ యవకుడు గల్లంతయ్యాడు. మోత్కూరు మండలం పాలడుగు గ్రామానికి చెందిన శివరాత్రి నవీర్ సోమవారం సాయంత్రం చేపల వేటకు వెళ్లాడు. చెరువు అలుగునీటిలో చేపలు పడుతున్న సమయంలో వరద ఉధృతి పెరిగడంతో నవీన్ గల్లంతైనట్లు స్థానికులు తెలిపారు. వలిగొండ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు.
ఆదివారం రాత్రి 10 గంటల నుంచి
సోమవారం వేకువజాము వరకు (మి.మీ)
జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు సగటున 78.4 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. అత్యధికంగా గుండాల మండలంలో 16 సెం.మీ, మోత్కూరు 118.6 సెం.మీ, అడ్డగూడూరులో 120.4 సెం.మీ, బొమ్మలరా మారంలో 116.4 సెం.మీ, తుర్కపల్లిలో 121.4 సెం.మీ రికార్డు స్థాయి వర్షం కురిసింది. అత్యల్పంగా సంస్థాన్‌నారాయణపురం మండలంలో 20.8 మి.మీ వర్షపాతం నమోదైంది. మొత్తంగా జూలై 1నుంచి ఆగస్టు నెల వరకు సాధారణ వర్షపాతం 312.2 మి.మీ కాగా.. 18వ తేదీ నాటికి 553.1 మి.మీ వర్షం కురిసింది. సాధారణం కంటే 240.9 మి.మీ వర్షపాతం అధికంగా నమోదైంది.

వానజోరు.. వరద హోరు

వానజోరు.. వరద హోరు

వానజోరు.. వరద హోరు

వానజోరు.. వరద హోరు

వానజోరు.. వరద హోరు

వానజోరు.. వరద హోరు

వానజోరు.. వరద హోరు

వానజోరు.. వరద హోరు

వానజోరు.. వరద హోరు