
సెప్టెంబర్ నుంచి కొత్త కార్డులకు బియ్యం
సాక్షి యాదాద్రి : సెప్టెంబర్ నుంచి కొత్త రేషన్ కార్డుదారులకు బియ్యం పంపిణీ చేయనున్నారు. జిల్లాలో కొత్తగా 24,431 రేషన్ కార్డులు మంజూరయ్యాయి. వీరికి 621 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం అవుతాయి. కొత్తవాటితో కలిపి రేషన్‌కార్డులు 91,262కి పెరిగాయి.ఇందులో 7,62,572 యూనిట్లు ఉన్నాయి. పాత, కొత్త కార్డుల యూనిట్లకు 4,836 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేయనున్నట్లు అదనపు కలెక్టర్ వీరారెడ్డి తెలిపారు. బియ్యాన్ని గోదాముల నుంచి రేషన్ దుకాణాలకు సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన మూడు నెలల బియ్యం జూన్ ఒకేసారి పంపిణీ చేసిన విషయం తెలిసిందే.
సర్వాయి పాపన్నకు నివాళి
భువనగిరిటౌన్ : బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి సర్వాయి పాపన్నగౌడ్ జయంతిని సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. భూస్వామ్య వ్యవస్థపై తిరుగుబాటు చేసి, దళిత,బహుజన,మైనార్టీలతో కలిసి ప్రజరా జ్యాన్ని నిర్మించిన ఘనత సర్వాయి పాపన్నదని కలెక్టర్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ శోభారాణి, ఆర్డీఓ కృష్ణారెడ్డి, డీఆర్‌ఓ జయమ్మ, డీఆర్‌డీఓ నాగిరెడ్డి, బీసీ సంక్షేమ శాఖ అధికారి సాహితీ, అధికారులు, కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఎంఎల్‌హెచ్‌పీకిషోకాజ్ నోటీస్
యాదగిరిగుట్ట రూరల్: మండలంలోని వంగపల్లి పల్లె దవాఖాన మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ (ఎంఎల్‌హెచ్‌పీ) డాక్టర్ అనూషకు అధికారులు షోకాజ్ నోటీస్ జారీ చేశారు. సోమవారం సాయంత్రం 3.30 గంటల సమయంలో దవాఖానను తనిఖీ చేయడానికి కలెక్టర్ వచ్చారు. ఆ సమయంలో ఆస్పత్రికి తాళం వేసి ఉంది. పైగా సిబ్బంది కూడా ఎవ్వరూ అందుబాటులో లేరు. ఎంఎల్‌హెచ్‌పీ సమాచారం ఇవ్వకుండా విధులకు గైర్హాజరైనట్లు తెలియడంతో ఆమెకు షోకాజ్ నోటీస్ జారీ చేయాలని డీఎంహెచ్‌ఓను ఆదేశించారు.
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్లు
భువనగిరి: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు కోరుతున్నట్లు భువనగిరి స్టడీ సెంటర్ కో ఆర్డినేటర్ డాక్టర్ రమేష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులతో పాటు చదువు మధ్యలో ఆపేసిన వారు ఈ నెల 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అదే విధంగా ద్వి తీయ, తృతీయ సంవత్సరం విద్యార్థులు ట్యూ షన్ ఫీజు చెల్లించేందుకు ఈనెల 30వరకు అవకా శం ఉందన్నారు. వివరాల కోసం సెల్‌నంబర్ 9000590545ను సంప్రదించాలని కోరారు.

సెప్టెంబర్ నుంచి కొత్త కార్డులకు బియ్యం