
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
సాక్షి, యాదాద్రి : రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈనెల 13 నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రజలకు అత్యవసర సేవలు అందించడానికి కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలు 08685293312 నంబర్‌కు ఫోన్ చేసి తమ సమస్యలు వివరించాలన్నారు. అధికారులు 24 గంటలు అందుబాటులో ఉండాలని చెప్పారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పోలీస్, రెవెన్యూ, వైద్య, ఇరిగేషన్, విద్యుత్, పంచాయతీరాజ్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. శిథిల భవనాల్లో నివసించే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. అసరమైన చోట పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. భారీ వర్షాల సమయంలో ప్రజలు బయటకు రావద్దన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కర్‌రావు, వివిధ శాఖ ల అధికారులు పాల్గొన్నారు. భువనగిరి జోన్ డీసీపీ అక్షాంశ్‌యాదవ్‌తో సమావేశమై వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు.
ఫ భారీ వర్షాల నేపథ్యంలో
కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు
ఫ అత్యవసర పరిస్థితుల్లో 08685293312 నంబర్‌కు
ఫోన్ చేయాలని సూచన