
ఆలేరును ఎడారిగా మార్చిన బీఆర్‌ఎస్
ఆలేరురూరల్: గత ప్రభుత్వం పాలనలో ఆలేరు ప్రాంతాన్ని ఎడారిగా మార్చారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. ఆలేరు మండలంలోని కొల్లూరు గ్రామంలో ఎస్సీ సబ్ ప్లాన్ పనులు, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ కింద మంజూరైన రోడ్డు పనులకు మంగళవారం శుంకుస్థాపన చేశారు. ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో ఇందిరమ్మ మోడల్ ఇల్లును ప్రారంభించారు. అనంతరం ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. గోదావరి జలాల ద్వారా మరోసారి చెరువులను నింపుతామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గ్రామాల్లో ఘన విజయం సాధించాలన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్‌రెడ్డి, మాజీ వైఎస్ ఎంపీపీ గాజుల లావణ్యవెంకటేష్, పారునంది భాస్కర్, నీలం పద్మ, వెంకటేశ్వరరాజు, చిలుకు కృష్ణ, జాలపు వనజారెడ్డి, దీపిక, నీలం వెంకటస్వామి, పిల్లలమర్రి శంకరయ్య, దశరథ, శ్రీపాల్‌రెడ్డి, ఆరె ప్రశాంత్, కర్రె అజయ్ తదితరులు పాల్గొన్నారు.
ఫ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య