పేదలను ప్రభుత్వం ఆదుకోవాలి
భూదాన్‌పోచంపల్లి: రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసి రెడ్డి సామాజిక వర్గంలోని పేదలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని రెడ్డి సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకుడు గంగిడి ప్రతాప్‌రెడ్డి అన్నారు. పోచంపల్లిలో నూతనంగా నిర్మించిన రెడ్డి సంక్షేమ సంఘం నూతన భవనాన్ని స్థల దాత గంగిడి నర్సింహారెడ్డితో కలిసి గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ.. రెడ్డి సామాజిక వర్గంలో కూడా ఎందరో నిరుపేదలున్నారని అన్నారు. వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, తెల్ల రేషన్‌కార్డులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం స్థల దాతతో పాటు భవన నిర్మాణానికి సహకరించిన దాతలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు రామసాని చంద్రశేఖర్‌రెడ్డి, ఉపాధ్యక్షులు నోముల నాగిరెడ్డి, ఏనుగు సంజీవరెడ్డి, ప్రధాన కార్యదర్శి సగ్గు మల్లారెడ్డి, సహాయ కార్యదర్శి కొమిరెల్లి శేఖర్‌రెడ్డి, కోశాధికారి కేసారం కొండల్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు కోట పుష్పలతమల్లారెడ్డి, గుణంగారి సదానందరెడ్డి, ఏనుగు కిషన్‌రెడ్డి, బొక్క బాల్‌రెడ్డి, సామల మల్లారెడ్డి, కొమిరెల్లి బాల్‌రెడ్డి, గంగిడి సుదర్శన్‌రెడ్డి, నోముల భీమ్‌రెడ్డి, ఏనుగు మధుసూధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


