సీఎం పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి | - | Sakshi
Sakshi News home page

సీఎం పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి

May 30 2025 1:11 AM | Updated on May 30 2025 1:11 AM

సీఎం

సీఎం పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి

సాక్షి యాదాద్రి : సీఎం పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి ఆదేశించారు. జూన్‌ 6న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో గురువారం ఆయన కలెక్టరేట్‌లో పలు శాఖల అధికారులతో సమావేశమై ఏర్పాట్లపై చర్చించారు. ఏచిన్న సమస్య తలెత్తకుండా సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. సమావేశంలో పోలీస్‌, రెవెన్యూ, డీఆర్‌డీఓ, పంచాయతీరాజ్‌, రవాణా, విద్యుత్‌, వైద్య, ట్రాఫిక్‌, మిషన్‌ భగీరథ, సివిల్‌ సప్లయ్‌, వ్యవసాయ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

లింగనిర్థారణకు పాల్పడితే క్రిమినల్‌ కేసులు

భువనగిరి : లింగ నిర్థారణకు పాల్పడితే చట్టప్రకారం క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని డీఎంహెచ్‌ఓ మనోహర్‌ హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి అడ్వైజరీ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 57 స్కానింగ్‌ సెంటర్ల అనుమతులు ఉండగా ప్రస్తుతం 41 పని చేస్తున్నాయని తెలిపారు. మార్చిలో నిర్వహించిన స్పెషల్‌ డ్రైవ్‌లో 41 స్కానింగ్‌ సెంటర్లను తనిఖీ చేసినట్లు పేర్కొన్నారు. లింగ నిష్పత్తిని తగ్గించేందుకు గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని వైద్యాధికారులకు సూచించారు. పాఠశాలలు, కళాశాలల్లో సదస్సులు నిర్వహించి పీసీ, పీఎన్‌డీటీ చట్టంపై అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో పీసీ అండ్‌ పీఎన్‌డీటీ కమిటీ సభ్యులు డాక్టర్‌ యశోద, డాక్టర్‌ మాలతి, కవిత, అరుంధతి, జిల్లా ప్రజా సంబంధాల అధికారి సౌజన్య, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ప్రమీళ, సార్స్‌ ఎన్జీళో ప్రతినిధి శివలింగం, నాగరాజు, అంజయ్య, వసంతికుమారి పాల్గొన్నారు.

నేషనల్‌ ఇన్నోవేటివ్‌ అవార్డుకు ఎంపిక

రామన్నపేట: మండలంలోని మునిపంపుల గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు కుక్కడపు రమేష్‌ నేషనల్‌ ఇన్నోవేటివ్‌ శిక్షారత్న అవార్డుకు ఎంపికయ్యాడు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉపాధ్యాయులతో ఏర్పడిన ఈ సంస్థ వినూత్న పద్ధతులతో బోధన చేసిన ఉపాధ్యాయులను ఎంపిక చేసి ఏటా అవార్డులు ప్రదానం చేస్తుంది. 2024–25 విద్యా సంవత్సరానికి గాను తెలంగాణ నుంచి నలుగురు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. ఇందులో కుక్కడపు రమేష్‌ కూడా ఉన్నారు. రహేష్‌ వలిగొండ మండలం పహిల్వాన్‌పురం ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు.

జిల్లా కేంద్ర ఆస్పత్రిని

సందర్శించిన డీఎంఈఏ

భువనగిరి: జిల్లా కేంద్ర ఆస్పత్రిని గురువారం డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అకాడమీ(డీఎంఈఏ) డాక్టర్‌ శివరాంప్రసాద్‌ సందర్శించారు. ఓపీ విభాగాలు, క్యాజువాలిటీ విభాగం, వార్డులు, మార్చురీ గదితో పాటు ఆస్పత్రి పై భాగంలో జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం రోగులకు అందజేస్తున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆస్పత్రి పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ మెడికల్‌ కళాశాల భవన నిర్మాణం కోసం ఇంకా స్థలం కేటాయింపు జరగలేదన్నారు. ఆయన వెంట ఆస్పత్రి సూపరింటెండెంట్‌ వెంకటేశ్వర్లు, వైద్యులు ఉన్నారు.

మీజిల్స్‌ వైరల్‌ వ్యాప్తి

చెందకుండా జాగ్రత్త పడాలి

మోటకొండూర్‌: మీజిల్స్‌ వైరల్‌ జబ్బు వ్యాప్తి చెందకుండా వెంటనే గుర్తించి అరికట్టాలని డబ్ల్యూహెచ్‌ఓ సర్వేలైన్‌ మెడికల్‌ అధికారి హజహర్‌ సూచించారు. గురువారం మోటకొండూరులోని పీహెచ్‌సీని సందర్శించి మీజిల్స్‌ వ్యాధిపై ఆరా తీశారు. మీజిల్స్‌ వైరస్‌ సోకినవారికి అధిక జ్వరం, దగ్గు, జలుబు, నోరులో చిన్నచిన్న తెల్లమచ్చలు వస్తాయన్నారు.

సీఎం పర్యటనకు  పటిష్ట ఏర్పాట్లు చేయాలి 1
1/2

సీఎం పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి

సీఎం పర్యటనకు  పటిష్ట ఏర్పాట్లు చేయాలి 2
2/2

సీఎం పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement