జిల్లా వ్యవసాయాధికారితో నేడు ఫోన్ ఇన్
నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు తప్పవు
ఈసారి వర్షాలు ముందుగానే కురుస్తున్నందున ఆరుద్ర కార్తె కంటే ముందే పంటల సాగుకు సన్నద్ధం కావచ్చా.. పత్తి తదితర మెట్టపంటలు ఎప్పుడు వేసుకుంటే బాగుంటుంది. వానాకాలం వరినార్లు పోసుకునేందుకు అనువైన సమయం ఎప్పుడు.. విత్తనాల ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి.. నకిలీ విత్తనాలను ఎలా గుర్తుపట్టాలి.. తదితర సమాచారం రైతులు తెలుసుకునేందుకు జిల్లా వ్యవసాయాధికారితో ‘సాక్షి’ గురువారం ఫోన్ ఇన్ నిర్వహిస్తోంది. రైతన్నలు నేరుగా వ్యవసాయాధికారికి ఫోన్ చేసి తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.
తేది. 29.05.2025 (గురువారం) సమయం : ఉదయం 10.00 నుంచి 11.00 గంటల వరకు
డయల్ చేయాల్సిన ఫోన్ నంబర్ :
89777 56419


